SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SL vs OMAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో ఓమాన్‌పై 105 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులకే పరిమితమైంది.
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?
Also Read
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
శ్రీలంక ఇన్నింగ్స్‌లో పావన్ రత్నాయకే 28 బంతులలో 8 ఫోర్లు, 1 సిక్స్ 60 పరుగులు చేశాడు. T20 ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు కుసాల్ మెండిస్ 45 బంతుల్లో 61 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఇక చివర్లో కెప్టెన్ దసున్ షనాకా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 20 బంతుల్లోనే 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా లంక వైపు తిప్పేశాడు. చివర్లో కమిందు మెండిస్ (19*), దునిత్ వెలలాగే (6*) వేగంగా పరుగులు జోడించి జట్టును 225 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చారు. ఓమాన్ తరఫున జితెన్ రమనంది 2 వికెట్లు తీసినా.. ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. సుఫ్యాన్ మెహ్మూద్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు.
T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!
226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓమాన్‌కు ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఆమీర్ కలీమ్ (6), జతీందర్ సింగ్ (1) త్వరగా అవుట్ అయ్యారు. మధ్యలో మహ్మద్ నదీమ్ 56 బంతుల్లో 53 పరుగులతో పోరాడినా ఇతర బ్యాటర్లు సహకారం అందించలేదు. చివర్లో వసీమ్ అలీ 27 పరుగులతో కొంత ప్రతిఘటన చూపినా.. శ్రీలంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఓమాన్ 120 పరుగులకే పరిమితమైంది. దుష్మంత చమీర, మహీష్ తిక్షణలు చెరో 2 వికెట్లు తీశారు. ఇంకా దునిత్ వెలలాగే, కమిందు మెండిస్ తలా ఒక వికెట్ తీసి ఓమాన్‌ను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!