Vivo V70 Price: ‘వివో వీ70’ ప్రీబుకింగ్స్ ప్రారంభం.. అధికారిక ధర, స్పెక్స్ డీటెయిల్స్ ఇవే!
- స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త సిరీస్ ఎంట్రీ
- వివో వీ70, వివో వీ70 ఎలైట్ లాంచ్
- వివో వీ70 సిరీస్ ప్రీబుకింగ్స్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త సిరీస్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అదే వివో వీ70 సిరీస్ (Vivo V70 Series). స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్న వివో.. వివో వీ70 (Vivo V70), వివో వీ70 ఎలైట్ (Vivo V70 Elite)లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ధరలు అధికారికంగా ప్రకటించడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ వివో వీ70, వివో వీ70 ఎలైట్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన కాన్ఫిగరేషన్‌లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివో వీ70 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12GB+256GB వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. ఈ మోడల్ ప్యాషన్ రెడ్, లెమన్ యెల్లో రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అధునాతన ఫీచర్లతో వచ్చిన వివో వీ70 ఎలైట్ మోడల్ 8GB+256GB వేరియంట్ రూ.51,999గా.. 12GB+256GB వేరియంట్ ధర రూ.56,999గా.. 12GB+512GB వేరియంట్ ధర రూ.61,999గా నిర్ణయించారు. ఈ మోడల్ హైఎండ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది.
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
- iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
వివో వీ70 సిరీస్ ప్రీబుకింగ్ నేటి నుంచే ఆరంభం అయింది. ఫిబ్రవరి 12 నుంచి 24 వరకు ప్రీబుకింగ్ కొనసాగుతుంది. అధికారిక సేల్ ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు జరగనుంది. అదనంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు ‘సూపర్‌వీక్’ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ధరలు, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్‌లు పరంగా చూస్తే.. వీ70 సిరీస్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వబోతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫోన్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ ఇచ్చే ఈ రంగుకు యూత్‌తో పాటు స్టైల్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.
Also Read: India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్!
వివో వీ70 ఎలైట్‌లో Snapdragon 8s Gen 3 చిప్‌సెట్, Android v16 OS ఉంటుంది. 7.32 ఇంచెస్ 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే ఉండగా.. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చింది. 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 200MP + 8MP + 2MP రియర్ కెమెరా ఉంటుంది.7300mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. IP69 రేటింగ్ కారణంగా నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్ పూర్తి రక్షణ పొందుతుంది.
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!