Crime Job : రోజుకు రూ.1000 జీతం… కానీ పని దొంగతనాలే.!
- రోజుకు వెయ్యి రూపాయలు జీతం
- దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్ లీడర్
- పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పనీపాట లేక.. అవారాగా తిరుగుతున్న పోకిరీలకు ఉద్యోగాలు ఇస్తున్నాడో వ్యక్తి ! అలా అని అతడ్ని మహానుభావుడు అనుకునేరు !! పెద్ద కంత్రీ ఫెలో. అతడు ఇచ్చే ఉద్యోగం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిత్యం రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు దొంగిలించి తీసుకురావాలి. ఇందుకు మూడు పూటలా తిండి పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాడు. ఉండటానికి షెల్టర్ ఇస్తాడు. ఎక్కువ ఫోన్లు దొంగిలించిన వాడికి బోనస్‌లు కూడా ఇస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తూ… భోజనం పెడుతూ… దొంగతనాలు చేయిస్తున్నాడో గ్యాంగ్ లీడర్. వీళ్లు చేయాల్సిందల్లా ఒకటే..!! పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి. ఒంటరిగా ఉన్న వారినో, బిజీగా ఉన్న వారినో టార్గెట్ చేసి.. సెల్ ఫోన్లు చోరీ చేయాలి. తీసుకొచ్చి గ్యాంగ్ లీడర్‌కి ఇవ్వాలి. ఇలాంటి కంత్రీ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు మెహిదీపట్నం పోలీసులు..
UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్..
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
వెస్ట్‌బెంగాల్‌కి చెందిన సాగర్ కుమార్ నోనియా మెహిదీపట్నంలో ఉంటున్నాడు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి పనుల కోసం హైదరాబాద్ వచ్చిన యువకులను తన వద్ద పనిలో చేర్చుకుంటున్నాడు. నెలంతా కష్టపడినా మీరేం సంపాదించలేరని.. తాను చెప్పిన పని చేస్తే లక్షలు సంపాదించొచ్చు అని మాయమాటలు చెప్పి.. దొంగలుగా మార్చుతున్నాడు. ఉండటానికి షెల్టర్ ఇచ్చి.. మూడు పూటల భోజనం పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఈ యువకులు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో టీ అమ్ముతున్నట్టు నటిస్తూ.. లేదా ప్రయాణికులుగా నటిస్తూ.. సెల్‌ఫోన్లు దొంగిలిస్తారు. రోజంతా దొంగిలించిన ఫోన్లను సాయంత్రానికి తమ లీడర్ సాగర్ కుమార్ నోనియాకు అప్పగిస్తారు. వాటిని సాగర్ కుమార్ దొంగ మార్కెట్లో అమ్ముకుంటాడు..
వరుస సెల్‌ఫోన్ స్నాచింగ్‌లపై నజర్ పెట్టిన మెహిదీపట్నం పోలీసులు.. ఈ ముఠాను పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, జార్ఖండ్‌కి చెందిన పరణ్ కుమార్, దేవా కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే 21 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పెంచి పోషిస్తున్న గ్యాంగ్ లీడర్ సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు..
Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!