Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ambali Recipe: చలికాలం చివరి దశకు వచ్చింది. వేసవి కాలం మొదలవుతుంది. ఇప్పుడే సూర్యుడు అక్కడక్కడా తన ప్రతాపాన్ని మెల్లగా మొదలు పెట్టేసాడు. మరి ఈ వేసవిలో శరీరానికి చలువ చేసే పానీయాల్లో ‘రాగి అంబలి’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇదివరకు పూర్వీకులు ఈ పానీయాన్ని తాగి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. రాగి అంబలి కేవలం చలువ చేయడమే కాకుండా, శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను కూడా అందిస్తుంది. మరి ఈ ‘రాగి అంబలి’ ఎలా చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
Also Read
* మొలకెత్తిన రాగి పిండి – 1 కప్పు
* నీళ్లు – 4 కప్పులు (మొదట ఉడికించడానికి)
* పెరుగు – 1 కప్పు
* కొత్తిమీర తరుగు
* కరివేపాకు
* ఉల్లిపాయ తరుగు – కొద్దిగా
* అల్లం తరుగు – 1 టీస్పూన్
* పచ్చిమిర్చి తరుగు – తగినంత
* ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
రాగి పిండి ఉడికించడం:
మొదటగా ఒక కప్పు మొలకెత్తిన రాగి పిండిని తీసుకుని అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి, పిండి చిక్కబడే వరకు సుమారు 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి తడి చేత్తో పిండిని తాకితే చేతికి అంటుకోకుండా ఉండాలి.
నానబెట్టడం:
ఉడికించిన రాగి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ పిండిని పెద్ద ఉండలుగా చేసుకుని, సుమారు 1.25 లీటర్ల నీరున్న ఒక మట్టి పాత్రలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానబెట్టడం వల్ల శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
అంబలి సిద్ధం చేయడం:
మరుసటి రోజు ఉదయం, ఆ రాగి ఉండలను నీళ్లలోనే మెత్తగా మెదిపేయాలి. ఆ తర్వాత వడకట్టినట్లయితే అంబలి ఉండలు లేకుండా సాఫీగా వస్తుంది.
పెరుగు, ఇతర పదార్థాలు చేర్చడం:
ఒక గిన్నెలో కప్పు పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలకాలి. ఈ పెరుగును వడకట్టిన రాగి అంబలిలో కలిపి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
పోషకాల కలయిక:
చివరగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన రాగి అంబలి సిద్ధం.
రాగి అంబలి ప్రయోజనాలు:
ఇది శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. విటమిన్లు, ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే వేసవిలో వచ్చే అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాగి అంబలిని రోజూ ఉదయం మరియు సాయంత్రం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వేసవిలో రాగి అంబలిని ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..