Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 12 02 2026

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 12, 2026 , 5:14 pm
By Gogikar Sai Krishna
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అభిషేక్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!

టీ20 మ్యాచ్‌లో కొనసాగుతున్నాయి. బరిలో నిలిచిన టీమ్‌లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. దూకుడు బ్యాటింగ్‌తో పేరున్న ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర కడుపు ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ.. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం పాకిస్థాన్‌తో కీలక పోరు ఉండటంతో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

విపక్ష ఎంపీల మరో వీడియో విడుదల చేసిన కేంద్రం

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేయగా… తాజాగా స్పీకర్ ఛాంబర్‌లో ఓం బిర్లాను విపక్ష ఎంపీలు బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు. 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌లోకి చొరబడి.. ఆయనను, ప్రధానమంత్రిని దుర్భాషలాడి బెదిరించారని కేంద్రమంత్రి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేశారని కిరణ్ రిజిజు ఆరోపించారు. ‘‘గౌరవనీయులైన స్పీకర్ చాంబర్‌లోకి 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి ఆయనను దుర్భాషలాడి. గౌరవనీయులైన ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. మా పార్టీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు.’’’ రిజిజు ఎక్స్‌లో రాశారు.

ఇండస్ట్రీలో మళ్లీ అండర్ వరల్డ్ నీడలు?.. బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్‌స్టర్!

బాలీవుడ్ నటులను ఓ భయం వెంటాడుతోంది. ఆ భయం ఏంటో కాదు.. లారెన్స్ బిష్ణోయ్. ఆ గ్యాంగ్ స్టార్ జైల్లో ఉన్నాడు కదా? అనే సందేహం రావొచ్చు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తోంది. ఇటీవల.. రణ్‌వీర్‌ సింగ్ నటించిన ‘ధురంధర్’ భారీ విజయాన్ని సాధించింది. ‘ధురంధర్ 2’పై కూడా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. మంగళవారం రణ్‌వీర్‌‌కు వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సందేశం వచ్చిన వెంటనే రణ్‌వీర్‌ ఇంటి వద్ద పోలీసుల పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. బెదిరింపు పంపిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పడంతో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్యాంగ్ పేరు బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. 90వ దశకంలో ఉన్న అండర్‌వర్ల్డ్ భయం మళ్లీ వస్తుందా? అనే సందేహం తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్‌లో మొత్తం 875 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే.. మెగా టోర్నీపై ఎంత క్రేజ్‌ ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ పాల్గొన్న మ్యాచ్‌లు అత్యధిక వ్యూయర్‌షిప్‌ను నమోదు చేయడం విశేషం. మూడింటిలో ఓ వంతు వ్యూయర్‌షిప్‌ టీమిండియా ఆడిన మ్యాచ్‌కే వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వ్యూస్ పరంగా టాప్ స్థానంలో భారత్ vs అమెరికా మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఏకంగా 260 మిలియన్ మంది వీక్షించారు. రెండో స్థానంలో పాకిస్థాన్ vs అమెరికా మ్యాచ్ ఉండగా.. 91 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. 86 మిలియన్ వ్యూస్‌తో ఇంగ్లండ్ vs వెస్టిండీస్ మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ 68 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. శ్రీలంక vs ఐర్లాండ్ మ్యాచ్ 58 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది.

అమెరికా అధికారి కండకావరం.. తెలుగు బిడ్డకు రూ.262 కోట్లు పరిహారం

ఓ అమెరికా అధికారి కండకావరానికి తెలుగు బిడ్డ అర్ధాంతరంగా తనువు చాలించింది. 23 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఓ కన్నపేగు తల్లడిల్లింది. న్యాయం కోసం  గుండె ఘోషించింది. చివరికి బాధితురాలి పక్షాన్నే న్యాయదేవత నిలిచింది. అగ్ర రాజ్యంలో ఓ తెలుగు బిడ్డ ఘన విజయం సాధించింది. జాహ్నవి కందుల(23).. భారతీయ విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వాసి. అమెరికాలోని సియాటిల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2023, జనవరిలో రోడ్డు దాటుతుండగా సియాటిల్‌‌లోని ఆఫీసర్ కెవిన్ డేవ్ కారు ఢీకొట్టింది. 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. అయితే కారుతో ఢీకొట్టిన తర్వాత అధికారి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. కండకావరమో.. లేదంటే గర్వమో తెలియదు గానీ.. పశ్చాత్తాపం లేకుండా అమానుషంగా మాట్లాడాడు. ‘‘ఆమె చనిపోయింది. ఆమె చాలా మామూలు మనిషి. 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ..’’ అంటూ వెకిలి నవ్వుతూ అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మాటలు భారతీయుల హృదయాలను కదిలించేశాయి. ఇంత దుర్మార్గమా? అంటూ న్యాయపోరాటానికి దిగారు.

మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..

దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయీ ‘అజయ్ దీక్షిత్’ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ (Netflix) కోసం రూపొందించిన వెబ్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్ విషయంలో వివాదాలు తలెత్తాయి. ఒక వర్గాన్ని కించపరచేలా ఈ పేరు ఉందంటూ దాఖలైన పిటిషన్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చిత్ర బృందంపై మండిపడింది.

ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?

నిన్న (బుధవారం) జరిగిన ఆఫ్ఘనిస్థాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో చెప్పనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కారణంగా చర్యలు తీసుకుంది. నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను ఉల్లంఘించినట్టు తేలింది. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ సూచనలను పాటించకపోవడం తప్పుగా భావిస్తారు. ఆఫ్ఘనిస్థాన్‌ ఇన్నింగ్స్ 14వ ఓవర్ ఆరంభంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడీ చేతికి ధరించిన రిస్ట్‌బ్యాండ్ విషయంలో నబీ అంపైర్లను ప్రశ్నిస్తూ వాదనకు దిగారు. అదే ఈ ప్లేయర్‌కు చెడ్డ పేరు తెచ్చింది.

బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇక వదిలేయండి..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ కల్తీ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. లడ్డూ అంశంపై పదే పదే చర్చించడం వల్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని సూచించారు. తప్పు చేసిన వారు ఉంటే వారిని వెంకటేశ్వర స్వామి, సీబీఐ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు, అలాగే జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ నిర్ణయమని తెలిపారు జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం..

ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం 114 రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుకు ఓకే చెప్పింది. ఈ డీల్‌తో భారత వైమానికదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలోనే భారత్ ఫ్రాన్స్ మధ్య రూ. 3.25 లక్షల కోట్ల మెగా డీల్ కుదిరే అవకాశం ఉంది. బిలియన్ డాలర్ల డీల్‌కు డీఏసీ అంగీకారం తెలిపినట్లు రక్షణ రంగ వర్గాలు చెప్పాయి. రక్షణ కార్యదర్శి అధ్యక్షతన ఉన్న డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ గత నెలలో రాఫెల్ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం భారతదేశంలోని అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలలో ఒకటిగా నిలువబోతోంది. చైనా, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ డీల్ జరిగింది. ప్రస్తుతం భారత వైమానిక దళానికి 42 స్వ్కాడ్రన్లు అవసరం, కానీ ఇప్పుడు 29 యుద్ధ విమానాల స్వ్కాడ్రన్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది.

అడవి బిడ్డలకు ‘సంజీవని’ డ్రోన్లు.. ఏపీలో సరికొత్త వైద్య విప్లవం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలకు ఆధునిక వైద్యాన్ని చేరువ చేసేందుకు సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ‘సంజీవని’ మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడం ద్వారా వైద్య రంగంలో సరికొత్త శకం మొదలైంది. కొండలు, కోనలు, వాగులు దాటుకొని ఆసుపత్రికి వెళ్లడం గగనమయ్యే మారుమూల గ్రామాల ప్రజలకు ఈ డ్రోన్లు ఇప్పుడు కల్పవల్లిలా మారాయి. అల్లూరి జిల్లాలోని 2,191 గిరిజన ఆవాసాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, అత్యవసర సమయాల్లో గర్భిణీలను, బాధితులను డోలీల ద్వారా కిలోమీటర్ల మేర మోసుకెళ్లడం అక్కడి ప్రజలకు నిత్యకృత్యం. ఈ ప్రయాణంలో జరిగే జాప్యం వల్ల ఎంతో మంది అర్ధాయుష్షుతోనే మరణిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, బెంగళూరుకు చెందిన ‘రెడ్ వింగ్’ సంస్థతో కలిసి ప్రభుత్వం డ్రోన్ సేవలను ప్రారంభించింది. రోడ్డు మార్గంలో ఒక ప్రాంతానికి వెళ్లడానికి గంటల సమయం పడితే, ఈ డ్రోన్లు కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే అక్కడకు చేరుకొని అత్యవసర మందులను అందజేస్తున్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • telugu news
  • Top Headlines 5PM
  • Top News

తాజావార్తలు

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..

  • Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions