AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
- ఇంటి నుంచే 10 నిమిషాల్లో పోలీస్ ఫిర్యాదు నమోదు
- వయస్సుకు తగ్గట్టు మాట్లాడే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ
- పోలీస్ స్టేషన్ భయం లేకుండా డిజిటల్ కంప్లైంట్ సౌకర్యం
- త్వరలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలు , వృద్ధుల కోసం ఒక విప్లవాత్మకమైన ఏఐ (AI) సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడతారు లేదా మొహమాటపడతారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేసే సాంకేతికతను వీరు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యార్థులు తయారు చేసిన సిస్టమ్ ఒక మనిషిలాగా ఎదుటివారితో మాట్లాడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మాట్లాడే వ్యక్తి వయస్సును బట్టి ఇది తన సంభాషణను మార్చుకుంటుంది. చిన్న పిల్లలు ఫిర్యాదు చేయాలనుకుంటే వారి మానసిక స్థితికి తగ్గట్టుగా సున్నితంగా మాట్లాడుతుంది. పెద్దవారు లేదా వృద్ధులతో వారి స్థాయికి తగినట్లుగా సంభాషించి వివరాలను సేకరిస్తుంది.
Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే సుమారు మూడు గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఏఐ సిస్టమ్ ద్వారా కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్ లేదా సంభాషణతో పూర్తి వివరాలను సేకరించి, ఆటోమేటిక్‌గా కంప్లైంట్ ఫైల్ చేసి సంబంధిత పోలీస్ అధికారులకు పంపిస్తుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనే భయం ఉండదు , బాధితులు ఎంతో కంఫర్టబుల్‌గా తమ సమస్యను చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ వాట్సాప్ వాడుతున్నందున, ఈ ఏఐ సిస్టమ్‌ను వాట్సాప్‌లోకి ఇంటిగ్రేట్ చేయనున్నారు. దీనివల్ల ప్రజలు మరింత సులభంగా, ఒక మెసేజ్ లేదా వాయిస్ నోట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసే వీలుంటుంది. ఈ వినూత్న ఆవిష్కరణ భవిష్యత్తులో పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!