Rafale Deal: 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం..
- 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం..
- మరింత బలోపేతం కానున్న భారత వైమానిక దళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale Deal: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం 114 రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుకు ఓకే చెప్పింది. ఈ డీల్‌తో భారత వైమానికదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలోనే భారత్ ఫ్రాన్స్ మధ్య రూ. 3.25 లక్షల కోట్ల మెగా డీల్ కుదిరే అవకాశం ఉంది.
Read Also: Ghooskhor Pandat : మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్ పండత్’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
బిలియన్ డాలర్ల డీల్‌కు డీఏసీ అంగీకారం తెలిపినట్లు రక్షణ రంగ వర్గాలు చెప్పాయి. రక్షణ కార్యదర్శి అధ్యక్షతన ఉన్న డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ గత నెలలో రాఫెల్ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం భారతదేశంలోని అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలలో ఒకటిగా నిలువబోతోంది. చైనా, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ డీల్ జరిగింది. ప్రస్తుతం భారత వైమానిక దళానికి 42 స్వ్కాడ్రన్లు అవసరం, కానీ ఇప్పుడు 29 యుద్ధ విమానాల స్వ్కాడ్రన్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది.
రాఫెల్ జెట్లను ఫ్రెంచ్ రక్షణ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తుంది. ఈ డీల్ ప్రకారం.. , 18 జెట్‌లను ఫ్లై-అవే స్థితిలో డెలివరీ చేస్తారు, మిగిలిన 96 జెట్‌లను భారతదేశంలో అసెంబుల్ చేస్తారు. దాదాపు 80 శాతం విమానాలను దేశీయంగా తయారు చేయాలని చూస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద స్వదేశీ కంటెంట్ 60 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు చేరే అవకాశం ఉంది. దేశీయ తయారీ, అసెంబ్లీ కోసం భారత ప్రైవేట్ రంగ కంపెనీలతో భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!