Ghooskhor Pandat : మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్ పండత్’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఘూస్‌ఖోర్ పండత్’ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయీ ‘అజయ్ దీక్షిత్’ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ (Netflix) కోసం రూపొందించిన వెబ్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్ విషయంలో వివాదాలు తలెత్తాయి. ఒక వర్గాన్ని కించపరచేలా ఈ పేరు ఉందంటూ దాఖలైన పిటిషన్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చిత్ర బృందంపై మండిపడింది.
Also Read : Taapsee Pannu : తప్పు పరిశ్రమది కాదు.. చూసే ప్రేక్షకులది!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అసలు విషయం ఏంటంటే.. ఒక అవినీతి పరుడికి ‘పండత్’ (పండిట్) అనే పదాన్ని జోడించడం తమ వర్గాన్ని అవమానించడమేనని బ్రాహ్మణ సంఘం ఆరోపించింది. ఈ మేరకు దర్శకుడిపై ఫిర్యాదు చేసి, సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో “సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు. ఇలాంటి పేర్లు ఆమోదయోగ్యం కావు. వెంటనే సినిమా పేరును మార్చండి” అని కోర్టు ఆదేశించింది. కొత్త టైటిల్‌ను కోర్టుకు తెలియజేసి, అందులో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేస్తేనే విడుదలకు అనుమతిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. మరి దీని పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!