Gold Robbery: బంగారం, డబ్బు కోసం పట్టపగలే దారుణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Robbery: బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో దోపిడీ దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బంగారం దోపిడీ కోసం దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. కత్తులు, మారణాయుధాలతో దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన ఓ దోపిడీ దొంగ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. అటు నెల్లూరులోనూ ఓ మహిళపై కత్తితో ఓ దోపిడీ దొంగ దాడి చేశాడు.
బంగారం, డబ్బు కోసం పట్టపగలే ఓ దుండగుడు దారుణానికి తెగించాడు. దొంగతనానికి వచ్చి ఇంట్లో ఉన్న మహిళను దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆరిలోవ పాతపోలీస్ స్టేషన్ ఎదురుగా కనకదుర్గనగర్‌లో కాపు రమణ, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రమణ జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటలకు ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. భార్య లక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉండగా ఉదయం 10 గంటలకు ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయాడు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
తర్వాత మళ్లీ 11 గంటల సమయంలో నెత్తిపై టోపీ, ముఖానికి మాస్క్ ధరించి ఎవరికి కనపడకుండా వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న లక్ష్మిపై దాడిచేసి గొంతునులిమి ప్రాణం తీశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో ఉన్న రూ.5 లక్షల నగదును తీసుకుని పారిపోయాడు. ఈమెను హత్య చేసిన విషయం కనీసం ఇరుగు పొరుగు వారికి కూడా తెలీయనీయకుండా దొంగతనానికి వచ్చిన దుండగుడు హత్య చేసి పారిపోయాడు.
ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం 5గంటలకు ఇంటికొచ్చి భార్యను పిలిచాడు. ఎంత పిలిచినా స్పందించలేదు. ఎలాంటి స్పందన భార్య నుంచి లేకపోయే సరికి కంగారు పడ్డాడు. వెంటనే లోపలికి వెళ్లి చూసేసరికి భార్య విగత జీవిగా పడి ఉంది. ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉండటం గమనించారు భర్త. భార్య చనిపోవడంతో షాక్‌కు గురై బిగ్గరగా అరవడంతో స్థానికులు చేరుకున్నారు. భార్య ఒంటిమీద బంగారం, బీరువాలో నగదు లేకపోవడంతో కుమార్తె, కుమారుడు, అల్లుడికి తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే లక్ష్మి మరణించినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించింది.
బాగా రెక్కీ నిర్వహించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె, కుమారుడు, బంధువులు అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్నా సాయంత్రం వరకు ఆమె మృతిచెందిన విషయం గుర్తించలేకపోయారు.
Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ టీచర్ మీద ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఒంటి మీద ఉన్న నగలు లాక్కెళ్లాడు. గూడూరుకు చెందిన ప్రభుత్వ మహిళ ఉపాధ్యాయురాలు హరిత.. బాలాయపల్లి మండలం గోట్టిగాడి గ్రామంలో ఉండే ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజూ గూడూరు నుంచి ఆమె స్కూలుకు వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు బస్ సమయానికి లేకపోవడంతో గూడూరులోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద వెంకటరమణయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కింది.
ఆటోలో హరిత ఒక్కరే ఉండటంతో.. ఆమె మెడలో ఉండే నగలు మీద ఆటో డ్రైవర్ కన్నేశాడు. బెదిరించి.. భయపెట్డి.. లేదంటే చంపి అయినా నగలు దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్‌కి వెళ్తున్న క్రమంలో బాలాయపల్లి సమీపంలోకి వెళ్లగానే కత్తితో బెదిరించాడు. మెడలో ఉండే నగలు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని భయపెట్టాడు. ఈ సమయంలో హరిత ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె మెడ మీద కత్తితో గాటు పెట్టాడు. ఇదే సమయంలో అతనికి కూడా రక్త గాయాలు అయ్యాయి. అనంతరం మెడలో ఉండే చైన్ తీసుకుని అక్కడి నుంచి అతను పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న హరిత జరిగిన విషయాన్ని తోటి టీచర్స్ కి ఫోన్ చేసి చెప్పారు. వారు హాస్పిటల్ కి తరలించారు.
AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
హరితకు గొంతు మీద తీవ్ర గాయాలు అవ్వడంతో నెల్లూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్ వెంకట రమణయ్యను మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నగలు రికవరీ చేయడంతో పాటు ఆటోని సీజ్ చేశామని వెల్లడించారు పోలీసులు. మొత్తానికి బంగారం కోసం దోపిడీ దొంగలు చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఐతే ఇలాంటి దోపిడీ దొంగలు బెయిల్‌పై బయటకు రాకుండా.. కఠిన శిక్షలు అమలు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి