Congress MPs vs Speaker: విపక్ష ఎంపీల మరో వీడియో విడుదల చేసిన కేంద్రం
- విపక్ష ఎంపీల మరో వీడియో విడుదల చేసిన కేంద్రం
- స్పీకర్ ఛాంబర్‌లో ఘర్షణ పడుతున్న వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేయగా… తాజాగా స్పీకర్ ఛాంబర్‌లో ఓం బిర్లాను విపక్ష ఎంపీలు బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు.
20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌లోకి చొరబడి.. ఆయనను, ప్రధానమంత్రిని దుర్భాషలాడి బెదిరించారని కేంద్రమంత్రి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేశారని కిరణ్ రిజిజు ఆరోపించారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
‘‘గౌరవనీయులైన స్పీకర్ చాంబర్‌లోకి 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి ఆయనను దుర్భాషలాడి. గౌరవనీయులైన ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. మా పార్టీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు.’’’ రిజిజు ఎక్స్‌లో రాశారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుండె పగిలే రిపోర్ట్!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అడ్డుకున్నారు. ఇక ఫిబ్రవరి 4న ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపీలు భౌతిక దాడికి సిద్ధపడుతున్నారని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీంతో స్పీకర్ పక్షపాతం వ్యవహరిస్తున్నారని.. తొలగించాలని కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా నడుస్తున్నాయి.
This is the illegal video clip taken by a Congress MP when 20-25 Congress MPs entered the Chamber of Hon’ble Speaker, abused him and threatened Honb'le Prime Minister. Our party believes in debate & discussion and never encourage MPs to threaten physically. https://t.co/bezzALc7D3 pic.twitter.com/iM0a50Z4rg
— Kiren Rijiju (@KirenRijiju) February 12, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?