Sheikh Hasina: బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికలు రద్దు చేయాలి..
- బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని నిషేధించాలి..
- హంతక యూనస్ ప్లాన్ చేసిన ఎన్నికలు..
- సంచలన విమర్శలు చేసిన షేక్ హసీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: హంతకుడు, ఫాసిస్ట్ మహ్మద్ యూనస్ నిర్వహించి బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన 18 నెలల తర్వాత బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి.
ఎన్నికలపై తన స్పందన తెలియజేస్తూ.. “ఈ ఓటర్లు లేని, చట్టవిరుద్ధమైన మరియు రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేయాలని, యూనస్ రాజీనామా చేయాలని; తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలతో పాటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, నిపుణులను విడుదల చేయాలని, అవామీ లీగ్ కార్యకలాపాలపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని, తటస్థ కేర్‌టేకర్ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుకొని ఎన్నికలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఓటు హక్కులను పునరుద్ధరించాలని’’ ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
ఎన్నికలు యూనస్ నిర్వహించిన ఒక మోసపూరిత కార్యక్రమంగా ఆమె అభివర్ణించారు. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా యూనస్ నిర్వహించి ఎన్నికలు జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రహసనం అని ఆమె ఆరోపించారు. ప్రజల ఓటింగ్ హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువను, రాజ్యాంగ స్పూర్తిని విస్మరించారని, అవామీ లీగ్, ఓటర్లు లేకుండా ఎన్నికల్ని నిర్వహించారని అన్నారు. ఫిబ్రవరి 11 సాయంత్రం నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, కాల్పులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ఓటింగ్ రోజు దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూర్తిగా ఓటర్లు లేరని ఆమె అన్నారు. 11 గంటలకు ఓటింగ్ శాతం 14.96గా ఉందని, ఓటింగ్ ఎక్కువగా ఉండే సమయంలోనే ఇంత తక్కువ ఓటింగ్ ఉందని, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికల్ని ప్రజలు తిరస్కరించడానికి ఇదే రుజువు అని చెప్పారు. అవామీ లీగ్ ఓటర్లు, మద్దతుదారుల్ని, మైనారిటీలను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు దాడులు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!