Ind vs Nam : నమీబియాపై భారత్ ఘనవిజయం.. ఇషాన్, హార్దిక్ మెరుపులు.!
- ఇషాన్ కిషన్ తుఫాన్ హాఫ్ సెంచరీ
- హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ షో
- 209 పరుగుల భారీ టార్గెట్
- 116కే కుప్పకూలిన నమీబియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తన జోరును కొనసాగిస్తోంది. అమెరికాపై గెలుపుతో టోర్నీని ప్రారంభించిన భారత్, రెండో మ్యాచ్‌లో నమీబియాను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా, నమీబియాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.
Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు (5 సిక్సర్లు, 6 ఫోర్లు) చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) ధాటిగా ఆడి స్కోరు బోర్డును 200 దాటించాడు. తిలక్ వర్మ (22), సంజూ శామ్సన్ (22) , శివమ్ దూబే (23) తమ వంతు సహకారాన్ని అందించారు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లతో రాణించినప్పటికీ, భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో నమీబియా నడ్డి విరిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించారు. నమీబియా బ్యాటర్లలో లారెన్ స్టీన్‌క్యాంప్ (29) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో గ్రూప్-A లో అగ్రస్థానానికి చేరువైన భారత్, తన తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
తాజావార్తలు
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!