Off The Record : జీహెచ్ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్
- జీహెచ్‌ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్
- శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా చేశారంటూ మండిపాటు
- విభజన వెనక కుట్ర ఉందని ఆరోపణ
- ఎంఐఎంకు లబ్ది చేకూర్చేలా విభజన జరిగిందంటూ లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్‌ను మూడుగా విభజించడం వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఉన్నాయా? ఆ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎందుకు మండిపడుతోంది? ఇవిగో…. ఇవీ… మీ ఉద్దేశ్యాలంటూ వేటిని ఎత్తి చూపుతోంది కాషాయ దళం? మూడు చోట్ల తమ బలం విషయంలో ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్‌ను మూడుగా పునర్విభజన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 300 వార్డ్‌లు, మూడు కార్పొరేషన్స్‌గా రూపు మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే…. సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్స్ కొత్తగా ఏర్పాటయ్యాయి. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు విభజన తీరుపై రాజకీయ వివాదాలు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా విభజన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు, అడ్డగోలుగా విభజించారంటూ మండిపడుతున్నారు కాషాయ లీడర్స్. అసలు జీహెచ్‌ఎంసీ విభజన వెనక చాలా పెద్ద కుట్ర ఉందన్నది బీజేపీ ఆరోపణ. కాంగ్రెస్ నాయకులు తమ మిత్రులకు రాజకీయ లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కమలం నేతలు.
హైదరాబాద్‌ను మజ్లిస్‌కు కట్టబెట్టే దిశగానే కాంగ్రెస్ సర్కార్ అలా విభజన చేసిందని అంటున్నారు. పాతబస్తీతో పాటు ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియాలను గ్రేటర్ పరిధిలో ఉంచారని, దాన్ని బట్టి చూస్తేనే… వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో అర్థమవుతోందని అంటున్నారు. అదే సమయంలో మూడు కార్పొరేషన్స్‌లో బీజేపీ పరిస్థితిపై కూడా చర్చ జరుగుతోంది. మూడు చోట్ల పార్టీకి పట్టుందని, జీహెచ్‌ఎంసీలో అయితే… బీజేపీ వర్సెస్ మజ్లిస్ అన్నట్టుగా పోరు జరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. అటు సైబరాబాద్, మల్కాజ్ గిరిల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పొలిటికల్ ఫైట్ ఉంటుందన్నది కమలం కేలిక్యులేషన్.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కొత్త కార్పొరేషన్స్ రెండూ ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఈటల రాజేందర్ పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఈ రెండు ఎంపీ సీట్లలో బీజేపీరి భారీ మెజారిటీ వచ్చింది. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో కూడా మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధి లో ఎక్కువ డివిజన్స్‌ను గెలుచుకుంది బీజేపీ. అయితే…గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న ప్రాంతాలు, కార్పొరేషన్ కూర్పు మాత్రం కాషాయ దళానికి మింగుడు పడ్డం లేదట. కోర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకునేలా ఈ విభజన ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు.
- Tags
- GHMC
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?