Instant Oats Idli Recipe: బియ్యం లేకుండా హెల్తీ ఇడ్లీ.. 15 నిమిషాల్లో ఓట్స్‌తో మృదువైన ఇన్‌స్టంట్ ఇడ్లీలు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instant Oats Idli Recipe: ఉదయం లేవగానే మహిళలు టిఫిన్ చేయడం ఓ పెద్ద పని. కుటుంబం మొత్తం సంతోషంగా కడుపు నిండా తినాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అలాగే తాను చేసిన టిఫిన్ హెల్తీగా ఉండాలని తాపత్రయపడుతుంది. ఇప్పుడు మనం బెస్ట్, హెల్తీ టిఫిన్ రెసిపీని ట్రై చేద్దాం. సాధారణంగా ఇడ్లీ అంటే బియ్యం, మినప్పప్పుతో పిండిని నూరి, పులియబెట్టి ఆవిరిలో వండి తయారు చేస్తాం. ఇందుకు భిన్నంగా ఉండే ఇన్‌స్టంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ గురించి తెలుసుకుందాం.. ఓట్స్ ఇడ్లీకి పులియబెట్టే అవసరం లేదు. ఓట్స్ పొడి, రవ్వ, పెరుగు, కొంచెం కూరగాయలు, మసాలాలు వేసి వెంటనే పిండిని తయారు చేసి, అందులో సోడా లేదా ఇనో వేసి ఆవిరిలో వండేస్తాం. అదే పులియబెట్టిన పిండిలా మృదువుగా ఉబ్బి వస్తుంది. ఇన్‌స్టంట్ టిఫిన్‌లో ఓట్స్ ఇడ్లీ బెటర్ అని చెప్పొచ్చు.
READ MORE: India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్!
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తయారీ విధానం..
ఓట్స్ ఇడ్లీలు తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకుని మిక్సీలో కొద్దిగా పొడిగా చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ముదురు ముదురు గానే ఉండాలి. తరువాత పాన్‌లో నూనె లేదా నెయ్యి వేడి చేసి, ఇష్టమైతే జీడిపప్పు వేయించి పక్కన పెట్టాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం వేసి వేగించాలి. ఇప్పుడు రవ్వ వేసి కొద్దిగా వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఓట్స్ పొడి కలిపి మళ్లీ కొద్దిసేపు వేయించాలి. ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్లు, పావు కప్పు పెరుగు వేసి మందమైన పిండిలా కలపాలి. ఇది 5–8 నిమిషాలు అలాగే ఉంచితే కొంచెం గట్టిపడుతుంది. ఇంతలో ఇడ్లీ కుకర్‌లో నీళ్లు వేసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి, అవసరమైతే ఇంకొంచెం నీళ్లు వేసి ఇడ్లీ పిండి మాదిరిగా గట్టిగా కానీ మృదువుగా ఉండేలా చేయాలి. చాలా పల్చగా ఉండకూడదు. ముద్దలు లేకుండా సాఫ్ట్‌గా కలపాలి. తరువాత తురిమిన క్యారెట్, కొత్తిమీర కలపాలి. చివరిగా అర టీస్పూన్ సోడా లేదా ఒక టీస్పూన్ ఇనో వేసి మెల్లగా కలపాలి. ఎక్కువగా కలిపితే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. వెంటనే ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోయాలి. ఆలస్యం చేయకూడదు. నీళ్లు బాగా మరిగుతున్నప్పుడు ప్లేట్లు పెట్టి సుమారు 10–12 నిమిషాలు ఆవిరిలో వండాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కర్ర పెట్టి చూస్తే అది శుభ్రంగా బయటకు వస్తే సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చెంచాతో తీసి ప్లేట్‌లో పెట్టాలి. వేడివేడిగా టమాటా చట్నీ లేదా ఇడ్లీ సాంబార్‌తో వడ్డిస్తే ఆద్భుతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!