మైసూర్ పాక్.. ఇది కర్ణాటక నుంచి ఉద్భవించింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ టైంలో దీని ఆవిష్కరణ జరిగింది.

బెంగాల్ లేడికేని బెంగాల్ లో ప్రముఖమైన స్వీట్. బ్రిటిష్ గవర్నర్ చార్లెస్ కానింగ్ భార్య కోసం లేడీ కానింగ్ స్వీట్ సిద్ధం చేశారు.

జిలేబీ.. ఇది అసలు భారతదేశానికి చెందిన స్వీట్ కాదు. పశ్చిమ ఆసియాకు సంబంధించిన స్వీట్. కాలక్రమంలో ఇండియాకు చేరింది.

జాంగ్రీ జాంగ్రీ మొఘలుల వంటశాలలో ఉద్భవించింది.

ఛెనార్ జిలిపి. ఇది పశ్చిమబెంగాల్ కు చెందిన స్వీట్..

గులాబ్ జామూన్ ఇది కూడా భారత దేశానికి చెందినది కాదు. మధ్య ఆసియా, టర్కిష్ ఆక్రమణదారుల నుంచి వచ్చినట్లు చెబుతారు. మొఘలులు తయారు చేసినట్లు కొన్ని వాదనలు ఉన్నాయి.

పూతరేకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫేమస్ స్వీట్. ఆత్రేయపురంలో నుంచి ఉద్భవించింది.

రసగుల్లా ఇది బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ప్రత్యేకమైన స్వీట్..ఈశాన్య భారతం నుంచి పుట్టినట్లు చెబుతారు.