Team India: టీమిండియా డేంజర్ ప్లేయర్ తండ్రికి స్టేజ్–4 క్యాన్సర్.. వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియాకు క్లిష్ట పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రింకూ అకస్మాత్తుగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రింకూ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిన్న(మంగళవారం) పరిస్థితి విషమించడంతో రింకూ టోర్నీ నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. రింకూ తండ్రి స్టేజ్–4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలవాలని భావించిన రింకూ జట్టు నుంచి తాత్కాలికంగా దూరమయ్యాడు. టోర్నమెంట్‌లో ఇండియన్ టీమ్‌లో ఉన్నప్పటికీ.. జట్టులోకి తిరిగి వస్తాడా? లేదా? అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రస్తుతం వైట్‌బాల్ క్రికెట్‌లో మ్యాచ్ ఎండింగ్‌లో రింకూ మంచి ఫర్ఫమెన్స్ కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో మ్యాచ్‌లను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో టీమ్‌లో చోటు దిక్కింది. దీంతో రింకూ వెళ్లిపోవడం టీమిండియాపై ప్రభా కాంబినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: PM Modi: నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు కనిపించినా రింకూ మాత్రం మైదానంలో కనిపించలేదు. ప్రస్తుతం అందరి దృష్టి రింకూ కుటుంబ పరిస్థితిపైనే ఉంది. ఈ కష్టకాలంలో క్రికెట్ ప్రపంచం మొత్తం అతనికి మద్దతుగా నిలిచే అవకాశముంది. అయితే.. ఈ అంశంపై జట్టు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు.. ఈ వరల్డ్‌కప్‌లో రింకూ బ్యాటింగ్ పరంగా పెద్దగా రాణించలేకపోయాడు. చివరి ఓవర్లలో మాత్రమే రంగంలోకి దింపడంతో ఐదు ఇన్నింగ్స్‌లలో 24 పరుగులకే పరిమితమయ్యాడు. అందులో రెండు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది టీ20ల్లో 10 మ్యాచ్‌ల్లో 115 పరుగులు చేసి సగటు 28.75, స్ట్రైక్‌రేట్ 132.18 నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, సూపర్–8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందిన టీమిండియా ఇప్పుడు ‘డూ ఆర్ డై’ స్థితిలోకి వెళ్లింది. గురువారం చెన్నైలో జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. టైటిల్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవడం టీమిండియాకు చాలా అవసరం. అంతే కాదు.. సౌతాఫ్రికా సూపర్–8లో అజేయంగా నిలవాలని భారత్ ఆశించాల్సి ఉంటుంది.
READ MORE: Thaman: ‘కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి’.. కొత్త వివాదానికి తెరలేపిన తమన్
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!