Fake Cigarettes Racket: బ్రదర్ జర భద్రం.. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Cigarettes Racket: సిగరెట్ ధరల పెంపుతో నకలీలు మార్కెట్లోకి దిగుతున్నాయి. అచ్చం అసలుకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీలను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు కేటుగాళ్లు. తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు గుర్తుపడుతున్నారు తప్ప.. లేదంటే తెలియడం లేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలో నకిలీ సిగరెట్ల దందా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నకిలీల బెడద ఖమ్మం జిల్లాకు కూడా పాకింది.
సాధారణంగా ప్రముఖ సిగరెట్ల బ్రాండ్లకు సంబంధించి ప్రధాన పట్టణాల్లో డీలర్లు ఉంటారు. కానీ కొందరు వ్యాపారులు రంగ ప్రవేశం చేసి పలు ప్రాంతాల నుంచి నకిలీ సిగరెట్ పెట్టెలను తెచ్చి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అలవాటును ఆసరాగా చేసుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో కొందరు వ్యాపారులు నకిలీ సిగరెట్ల దందాకు తెర తీశారు. కానీ క్షుణ్నంగా పరిశీలిస్తే తప్ప అసలు, నకిలీ సిగరెట్ల మధ్య తేడాను గుర్తించడం సాధ్యం కాదు. బంగ్లాదేశ్ కేంద్రంగా తయారైన నకిలీ సిగరెట్లు హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి వివిధ జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నకిలీ సిగరెట్లు తరలిస్తున్నారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?
మామూలు సిగరెట్ల కంటే పెట్టె ఒక్కంటికి 20 నుంచి 50 రూపాయలు వరకు తగ్గించి అమ్మడంతో సత్తుపల్లిలో ఉన్న ప్రతి పాన్, బార్ షాపులల్లో అమ్మకాలు చేపడుతున్నారు. అలానే వీ.ఎం.బంజర్‌లో పలు కిరాణాషాపు నిర్వహకులు నకిలీ సిగరేట్లను అమ్మకాలు చేస్తున్నారు. నకీలి సిగరేట్ ఒక్కొక్కటి తాగే వినియోగదారుడి నుండి గోల్డ్ ఫ్లేక్ లైట్ సిగరేట్ ఒక్కంటికి 25 రూపాయాలు దుకాణాదారులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక్క సిగరేట్ తాగటానికి 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ నకీలీ సిగరేట్స్ వచ్చాక నిమిషంలోపే సిగరేట్ కాలి బుడిద అవుతోందని రెండు,మూడు దమ్ములు పీల్చే వరకు సిగరేట్ అయిపోతుందని వినియోగదారులు చెబుతున్నారు.
సత్తుపల్లిలో ప్రముఖ ఐటీసీ సంస్థ ఏరియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న విక్రయదారుడు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని చిన్నచిన్న దుకాణాలకు విక్రయిస్తూ ఉంటారు. ఇటీవల ఐటీసీ సంస్థ చాక్లెట్, బింగో, గోధుమ పిండి, ఆగర్ వత్తులు వంటివి కొనుగోలు చేస్తే దుకాణదారులకు సిగరెట్లు ఎమ్మార్పీకే అందజేస్తామని తెలియజేయడంతో అందుకు దుకాణదారులు నిరాకరించారు. దీంతో సిగరెట్లు ఎమ్మార్పీ కంటే అదనంగా 20 రూపాయాల నుంచి 30 రూపాయాల వరకు వసూలు చేస్తున్నారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సిగరెట్లు రేట్లు పెంచడంతో సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో సిగరెట్ల విక్రయదారులు కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే ఒక్కొక్క పెట్టెపై 20 రూపాయాల నుంచి అత్యధికంగా 50 రూపాయాల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. సాధారణంగా చిన్న గోల్డ్ ఫ్లాక్ ఎమ్మారీ 100 రూపాయాలు ఉండగా 120 రూపాయాలకు అమ్ముతున్నారు. ఇలా ప్రతి సిగరెట్ పెట్టపై 20 రూపాయాల నుంచి 50 రూపాయాల వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
సరికొత్త కలర్ ఆప్షన్లతో KTM 200 Duke, KTM 250 Duke బైక్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
సిగరెట్లు,పాన్ మసాలా, తంబాకు, ఆర్ఆర్, మిరాజ్, విమల్ వంటి విక్రయాలలో ఎక్కువ భాగం కంప్యూటర్ ప్రింట్, జీఎస్టీ, చెల్లించకుండా కేవలం తెల్ల కాగితం పై బిల్లు రసీదులను అందజేసి విక్రయాలు చేపడుతున్నారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నకిలీ సిగరెట్లు.. మరోవైపు ఎమ్మార్సీకి మించి సిగరెట్లు,పాన్ మసాలా, విమల్, ఆర్ఆర్ అమ్మకం ఎటువంటి కంప్యూటర్ బిల్లు ఇవ్వకుండా జీఎస్టీలు ఎగవేస్తూ జీరో దందాకు తెరతీశారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కంపెనీ ప్రతినిధులు సత్తుపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నకిలీ సిగరెట్ల విక్రయాలలో బిల్లు చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించి జీరో దందాకు అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!