Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Frauds : పెళ్లి పేరుతో యువతులకు వల వేస్తున్నారు కేటుగాళ్లు. వారిని శారీరకంగా ఉపయోగించుకుని.. పైగా డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి. షాదీ డాట్ కామ్‌లో పరిచయం చేసుకుని మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు ప్రేమ పేరుతో వల విసురుతున్న ఓ పాస్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఈ మధ్య చాలా మంది మ్యారేజ్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. అందులో షాదీ డాట్ కామ్ కూడా ఒకటి. కానీ కొంత మంది కేటుగాళ్లు.. ఆయా వెబ్‌సైట్స్‌లో తమను తాము పెళ్లి కాని యువకులుగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మెల్లగా ఫోన్ నంబర్ సేకరించి.. మాయమాటలతో యువతులకు వల విసురుతున్నారు. ఐతే ఒంటరి మహిళలనే వారు టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు.
READ ALSO: సరికొత్త కలర్ ఆప్షన్లతో KTM 200 Duke, KTM 250 Duke బైక్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
అతని పేరు చిన్న రంగా నాయక్. హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్నాడు. షాదీ డాట్ కామ్‌లో ఒంటరి మహిళలను ఇతడు టార్గెట్ చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. తన మాయ మాటలతో నిజంగానే పెళ్లి చేసుకుంటానని నమ్మేలా చేయడం ఇతని స్పెషాలిటీ. అలాగే బాలాపూర్ మండలం మీర్‌పేట్‌లో ఉండే భవానీ అనే మహిళకు వల విసిరాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని.. పెళ్లి చేసుకుంటానని పూర్తిగా నమ్మించాడు. చివరకు తనకు ఖర్చులు ఉన్నాయంటూ క్రమక్రమంగా ఆమె వద్ద నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. తన ఖర్చుల కోసం అవసరాలు తీరిపోగానే.. ఇల్లు నిర్మించుకుందామని చెప్పాడు. కానీ డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భవానీ షాకైంది. గతంలోనూ ఇలాగే తప్పుడు పేర్లతో షాదీ డాట్ కామ్‌లో చిన్న రంగనాయక్ పలువురు మహిళలను మోసం చేసినట్లు భవానీ గుర్తించింది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతోంది.
మరోవైపు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ పాస్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేసి.. ప్రేమ పేరుతో మహిళలకు వల విసురుతున్నాడు. అతని పేరు సందీప్ వడేగర్. ఉప్పల్‌లో నివాసం ఉంటూ లివింగ్ వే చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె ప్రభుత్వోద్యోగం చేస్తుండడంతో వచ్చిన జీతం తీసుకుంటూ ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. ఐతే అతని వేధింపులు తట్టుకోలేక పాస్టర్ సందీప్ ఆగడాలపై ఆ మహిళ ఆరా తీసింది. సందీప్‌కు అతని స్నేహితుడి భార్యతో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించింది. దీనిపై అతన్ని నిలదీయడంతో ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడు. సందీప్ బెదిరించడంతో.. ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో నిందితుడు పాస్టర్ సందీప్ వెనుక సికింద్రాబాద్‌లోని మరో చర్చి ఫాదర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు మహిళ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Roshan Meka: బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలతో ఛాంపియన్ హీరో!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!