OnePlus 15T Launch: హైఎండ్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. డ్రీమ్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌గా ‘వన్‌ప్లస్ 15టీ’!
- కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌కి కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధమవుతోన్న వన్‌ప్లస్
- వన్‌ప్లస్ 15టీపై టెక్ ప్రపంచంలో భారీ ఆసక్తి
- హైఎండ్ కెమెరా, బిగ్ బ్యాటరీతో వన్‌ప్లస్ 15టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌కి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ‘వన్‌ప్లస్’ సిద్ధమవుతోంది. త్వరలో విడుదల కానున్న ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) ఫోన్ స్పెసిఫికేషన్లు బయటకు రావడంతో టెక్ ప్రపంచంలో భారీ ఆసక్తి నెలకొంది. చిన్న సైజ్‌లోనే భారీ పవర్, ప్రీమియం ఫీచర్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ మోడల్‌ను వన్‌ప్లస్ రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలో చైనాలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 15టీ లీక్ ఫీచర్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
వన్‌ప్లస్ 15టీ ఫోన్‌లో 6.32 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 165Hz ఎల్‌టీపీసీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ ఫ్లాగ్‌షిప్ స్థాయి విజువల్ అనుభూతి అందించేలా స్క్రీన్ రూపొందించారు. లేటెస్ట్ Snapdragon 8 Elite Gen5 ప్రాసెసర్ ఉండనుందని సమాచారం. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను ఈజీగా నిర్వహించేలా చేస్తుంది. కెమెరా సెటప్ కూడా హైఎండ్ లెవల్‌లో ఉండనుంది. 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP టెలిఫోటో లెన్స్ ఉండగా.. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశముంది.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
Also Read: Dacoit Release Date: సాలిడ్ అప్‌డేట్.. ఆరోజే ‘డెకాయిట్’ రిలీజ్!
వన్‌ప్లస్ 15టీలో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ అనే చెప్పాలి. కాంపాక్ట్ ఫోన్ అయినప్పటికీ 7500mAh వరకు భారీ బ్యాటరీ ఇవ్వనున్నట్లు లీకులు చెబుతున్నాయి. 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి. అంటే పెద్ద స్క్రీన్ ఫోన్లకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉంటుందన్నమాట. సెక్యూరిటీ, డ్యూరబిలిటీ విషయాల్లో కూడా ఈ మోడల్ ప్రత్యేకంగా నిలవనుంది. IP68 మరియు IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండగా.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ద్వారా సెక్యూరిటీ మరింత మెరుగ్గా ఉంటుంది.
మొత్తం మీద చూస్తే.. 2026 మొదటి భాగంలో విడుదల కానున్న కాంపాక్ట్ స్ట్రైట్-స్క్రీన్ ఫోన్లలో వన్‌ప్లస్ 15టీ అత్యంత పవర్‌ఫుల్ డివైస్‌గా నిలిచే అవకాశముందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న సైజ్‌లో పెద్ద పనితీరు కోరుకునే యూజర్లకు వన్‌ప్లస్ 15టీ ‘డ్రీమ్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్’గా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!