Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.
Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ గురువారం ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఒక కోటలో విజయ్ – రష్మికల వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. విజయ్ మరియు రష్మికకు అత్యంత సన్నిహితులైన కొద్దిమంది స్నేహితులకు మాత్రమే ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారు. తక్కిన వారెవరికీ ఈ పెళ్ళికి ఎంట్రీ లేదు. ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగించుకుని వచ్చిన తర్వాత, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. . ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలకు ఆహ్వాన పత్రికలు అందించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ ‘రీల్’ జోడీ ఇప్పుడు ‘రియల్’ లైఫ్ పార్ట్‌నర్స్ కాబోతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!