Trump: భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో వాణిజ్య దాడి
- సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- ఇటీవలే గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేసిందో లేదో వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం గంటల వ్యవధిలోనే దాన్ని 15 శాతానికి పెంచారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
తాజాగా అమెరికా పార్లమెంటులో వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. భారతదేశం, ఇండోనేషియా, లావోస్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా సౌరశక్తి ఉత్పత్తులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?
వాణిజ్య శాఖ డేటాను పరిశీలిస్తే.. 2024 సంవత్సరంలో అమెరికా భారతదేశం నుంచి సౌరశక్తి దిగుమతుల విలువ 792.6 మిలియన్ డాలర్లు ఉంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న మూడు దేశాల నుంచి గత సంవత్సరం సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీని ఆధారంగా 2025 మొదటి అర్ధభాగంలో US సౌర నమూనా దిగుమతుల్లో 57 శాతం భారతదేశం, ఇండోనేషియా, లావోస్ నుంచి మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం నుంచి వచ్చే సౌరశక్తి ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని విధించింది. ఇండోనేషియాకు 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉంటుంది. లావోస్‌కు ఇది 81 శాతం ఉంటుంది. ఈ దిగుమతి సుంకం రేట్లు విదేశీ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ దేశాల నుంచి ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను దేశీయ సౌరశక్తి ఉత్పత్తిదారుల కంటే తక్కువ ధరకు విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. భారీ సుంకాలను విధించాలనే ట్రంప్ పరిపాలన చర్య దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!