Airtel NBFC License: ఎయిర్‌టెల్ బిగ్ ప్లాన్.. ముఖేష్ అంబానీకి గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel NBFC License: టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్, ఇప్పుడు ఆర్థిక రంగంలోకి అడుగుపెడుతోంది. తన సొంత ఫైనాన్స్ కంపెనీ అయిన ‘ఎయిర్‌టెల్ మనీ’ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడితో రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేవలం రీఛార్జ్‌లు, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఇకపై తన కస్టమర్లకు నేరుగా లోన్లు (అప్పులు) ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ మూలధనంలో 70 శాతం ఎయిర్‌టెల్ ద్వారా, మిగిలిన 30 శాతం భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13, 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి NBFCగా పనిచేయడానికి ఎయిర్‌టెల్ మనీ లైసెన్స్ తీసుకుంది.
READ ALSO: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
రాబోయే కొద్ది ఏళ్లలో రూ.20,000 కోట్లను ఈ కంపెనీలో పెట్టబోతున్నారని సమాచారం. ఇందులో 70% ఎయిర్‌టెల్ నుంచి, 30% భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఎయిర్‌టెల్ గట్టి పోటీని ఇవ్వబోతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌టెల్ గత రెండేళ్లలోనే తన డిజిటల్ యాప్ ద్వారా సుమారు రూ.9,000 కోట్ల లోన్లను ఇచ్చింది. ఇప్పుడు సొంతంగా ఫైనాన్స్ కంపెనీ పెడుతుండటంతో ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కానుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ దగ్గర కస్టమర్ల డేటా, టెక్నాలజీ ఉండటం వల్ల, లోన్ తీసుకునే వారు తిరిగి కడతారా లేదా అనే రిస్క్‌ను ముందే అంచనా వేయగలమని ఎయిర్‌టెల్ నమ్మకంగా ఉంది. ఇప్పటివరకు ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల లోన్లు తీసుకునేవారు. కానీ ఇకపై ఎయిర్‌టెల్ తన సొంత డబ్బుతోనే కస్టమర్లకు చిన్న చిన్న లోన్లు, బిజినెస్ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు సులభంగా లోన్లు దొరుకుతాయి. ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. NBFC విస్తరణ ద్వారా విశ్వసనీయమైన, వినూత్నమైన డిజిటల్ లెండింగ్ వ్యాపారాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు.
READ ALSO: High Court: “జాతకం” పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు.. హైకోర్టు కీలక తీర్పు..
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!