Michael Vaughan: “పాకిస్థాన్ క్రికెట్‌లో పాలిటిక్స్”.. బాబర్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Vaughan: పాకిస్థాన్ టీమ్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. టీమ్ ఎంపిక నుంచి ఆట వరకు ఎక్కడ చూసినా తప్పకుండా ఏదో వివాదం ఉండే ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై కష్టాల బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ మ్యాచ్‌లో నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ 24 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్ట్రైక్‌రేట్ కూడా 104కే పరిమితమవ్వడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబర్ సెలక్షన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Test Twenty Cricket: క్రికెట్‌లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ (Michael Vaughan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పాకిస్థాన్ జట్టులో బాబర్ స్థానానికి సంబంధించిన నిర్ణయాల్లో రాజకీయాలు ఉండొచ్చన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్న హెడ్ కోచ్ మైక్ హెస్సన్ (Mike Hesson) తీరును ప్రశంసించారు. వాఘన్ ప్రకారం.. బాబర్‌ను పూర్తిగా డ్రాప్ చేయడం కష్టం. ఇన్సూరెన్స్ పాలసీలా నంబర్ 4లో ఉపయోగిస్తున్నారట. అంటే టాప్ ఆర్డర్ త్వరగా ఔటైతే క్రీజులో నిలబడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత బాబర్‌పై ఉంటోందన్నమాట. అయితే ఈ వ్యూహం రాజకీయంగా సరైన నిర్ణయం కావొచ్చు గానీ, వరల్డ్‌కప్ గెలవడానికి మాత్రం ఇది బెస్ట్ కాంబినేషన్ కాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బాబర్‌కు వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌లోనూ నిరాశే ఎదురైంది. 2024 టోర్నీలో అతని స్ట్రైక్‌రేట్ కేవలం 101 ఉండగా, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సైతం బాబర్ సగటు 22.75 మాత్రమే ఉండటం, స్ట్రైక్‌రేట్ 112 వద్ద ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బాబర్ నుంచి అభిమానులు ఆశించే స్థాయి ప్రదర్శన మాత్రం కనిపించడం లేదు.
READ MORE: Komali Suicide: ప్రేమ, వేదన, ఎదురు చూపులు.. కన్నీళ్లు పెట్టించే యూట్యూబర్ కోమలి సూసైడ్ నోట్..
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్‌లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?