Virosh Wedding: కోడలు రష్మికకు..అత్తగారు షాకింగ్ గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ‘విరోష్’ పెళ్లికి సంబంధించి ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన సంఘటన చోటుచేసుకుంది. తన కాబోయే కోడలు రష్మికను కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ విజయ్ తల్లి మాధవి దేవరకొండ ఒక అపురూపమైన కానుకను అందజేశారు.
Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా ఇది.. మహేష్-రాజమౌళి ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ప్రశంసలు!
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఉదయ్‌పుర్‌లోని ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగీత్ ఈవెంట్‌లో, విజయ్ తల్లి మాధవి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుమతిగా ఇచ్చారు. తరతరాలుగా తమ కుటుంబంలో పెద్దల నుంచి వస్తున్న ఈ గాజులను కోడలికి అందించడం ద్వారా, రష్మికను తమ ఇంటి మనిషిగా గౌరవిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అత్తగారి నుంచి అందిన ఈ అపురూప కానుకను చూసి రష్మిక ఎమోషనల్ అయ్యారని, అక్కడ ఒక్కసారిగా అందమైన కుటుంబ వాతావరణం నెలకొందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ వివాహ వేడుకల్లో భాగంగా అంతకుముందు సరదాగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ (VPL) పేరుతో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఇందులో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరపు బంధువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే విజయ్ దేవరకొండ పూల్ వాలీబాల్ ఆడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలకు దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రేపు (ఫిబ్రవరి 26న) తెలుగు, కొడవ (రష్మిక కుటుంబ సంప్రదాయం) పద్ధతుల్లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..