Mohammad Kaif: టీమిండియాకు తిలక్ వర్మ ‘నెక్స్ట్ కోహ్లీ’.. స్ట్రైక్ రేట్ విమర్శలపై మాజీ క్రికెటర్ సంచలన వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్‌గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్‌లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిల పడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి ఉండటంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు వచ్చిన గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిలక్ బ్యాటింగ్‌లో పాత ఫ్లో కనిపించడం లేదనే వాదన జోరందుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో 107 పరుగులు చేసినా స్ట్రైక్‌రేట్ 118.88 మాత్రమే ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ లెక్కలు తిలక్ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం గురించే చర్చకు దారితీసేలా చేశాయి.
READ MORE: Medical Miracle:వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భాశయం లేని మహిళకు పండంటి బిడ్డ.. ఎలా సాధ్యమైంది?
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో తిలక్ పాత్రను టీ20 ఛేజింగ్‌లలో విరాట్ కోహ్లీ టెంప్లేట్‌తో పోల్చారు. ప్రతి ఆటగాడికి జట్టులో స్పష్టమైన పాత్ర ఉండాలని తెలిపారు. తిలక్ తన సహజమైన ఆటను వదిలి ఇతరుల మాటలు పట్టించుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. తిలక్ బలం ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, చివరి వరకు ఆడటమని స్పష్టం చేశారు. ఛేజ్‌లలో విరాట్ కోహ్లీ తరహా పాత్రను తిలక్ పోషించాలని చెప్పారు. పెద్ద షాట్ కోసం ముందుకు వచ్చి ఔట్ కావడం తిలక్ సహజమైన ఆటకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే.. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం అగ్రెసివ్‌గా ఆడే ఆటగాళ్లతో నిండిపోయిందని కైఫ్ గుర్తుచేశారు. “అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు చెలరేగుతారు. వేగంగా పరుగులు పూర్తి చేస్తారు. అలాంటి సమయంలో తిలక్ వర్మ లాంటి వాళ్లు నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్ చివరి వరకు పోరాడాలి. ఈ పాత్ర చాలా కీలకం. ఛేజ్ మాస్టర్ కావాలంటే 20వ ఓవర్ వరకు క్రీజులో ఉండే ఆటగాడు తప్పనిసరిగా ఉండాలని, ఆ పాత్ర తిలక్ పోషించాల్సిందే.” అని సూచించారు.
READ MORE: Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!