Anthropic AI: ఈసారి “హెచ్‌ఆర్”లకే ఎసరు.. క్లాడ్ ఏఐ కొత్త ఫీచర్లతో ఉద్యోగాలకు ముప్పు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic AI: ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఏఐ ప్రముఖ్యత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మరో పెద్ద అడుగు వేసింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఏఐ (Anthropic) తన క్లౌడ్ ఏఐ (Claude AI) కోసం కొత్త ఎంటర్‌ప్రైజ్ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీల్లోని వివిధ విభాగాల కోసం ప్రత్యేకంగా ప్లగిన్లు రూపొందించింది. ఈ కొత్త ప్లగిన్లతో మరోసారి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గుండెల్లో గుబులు పెంచింది. ఏకంగా హెచ్ఆర్‌లకే ఎసరుపెట్టింది. ఇందులో హ్యూమన్ రిసోర్సెస్ (Human Resource Management) నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి టీమ్‌కు సరిపోయే విధంగా వీటిని తయారు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల క్లాడ్‌కు ప్లగిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు కుదేలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత శక్తివంతమైన ఎంటర్‌ప్రైజ్ టూల్స్ రావడంతో ఈ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
READ MORE: Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
కొత్త ఫీచర్లతో కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టు కస్టమ్ ప్లగిన్లను సృష్టించుకోవచ్చట. ఇప్పటికే ఉపయోగిస్తున్న టూల్స్‌తోనూ క్లాడ్‌ను నేరుగా కనెక్ట్ చేయవచ్చట. ఉదాహరణకు Google Drive, Gmail, DocuSign, LegalZoom వంటి సర్వీసులతో ఇది పనిచేస్తుంది. అంటే ఒకే ఏఐ ద్వారా డాక్యుమెంట్లు తయారు చేయడం నుంచి అనలిసిస్ వరకు చాలా పనులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. డెస్క్‌టాప్ యాప్‌లో ఉన్న “Claude Cowork” ఫీచర్‌తో ఈ ప్లగిన్లు కంప్యూటర్‌లో ఫైళ్లను సృష్టించడం, మార్చడం కూడా చేస్తాయట. ప్రపంచంలోని పెద్ద కంపెనీలతో కలిసి వీటిని అభివృద్ధి చేయడం వల్ల క్లాడ్ ఒక పూర్తి స్థాయి ఏఐ ఏజెంట్‌లా పనిచేస్తుందట. ఈ ప్లగిన్ల సామర్థ్యాలు విస్తృతంగా ఉన్నాయట. ఫైనాన్షియల్ మోడలింగ్, మార్కెట్ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈక్విటీ రీసెర్చ్ నోట్స్ తయారు చేయడం, ఆపరేషన్స్ రిపోర్ట్స్ రూపొందించడం, హెచ్‌ఆర్‌కు జాబ్ డిస్క్రిప్షన్స్ నుంచి ఆన్‌బోర్డింగ్ మెటీరియల్ వరకు తయారు చేయడం లాంటి అన్నింటినీ ఒకే ఏఐ టూల్ చేస్తుందట. పోర్ట్‌ఫోలియో అనలిసిస్ చేసి ఆస్తుల రీబ్యాలెన్సింగ్ సూచనలు ఇవ్వడం, డిజైన్ టీమ్‌లకు ఫిగ్మా (Figma)తో కలిసి క్రియేటివ్ బ్రీఫ్స్ తయారు చేయడం, ఇంజినీరింగ్ డాక్యుమెంటేషన్‌ను నేరుగా రిపోజిటరీలకు పంపించడం వంటి పనులు సైతం చేయగలదట. ఒక కంపెనీకి ప్రత్యేకమైన బ్రాండ్ వాయిస్‌లోనే కంటెంట్ తయారు చేసే విధంగా ట్రెయిన్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త టూల్‌తో వాల్ స్ట్రీట్‌లో ఆందోళనను పెంచుతున్నాయి. క్లాడ్ Cowork ప్రకటించినప్పటి నుంచి Salesforce షేరు సుమారు 22%, Intuit 33%, Snowflake 20% వరకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో సంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీల అవసరాన్ని ఏఐ తగ్గిస్తుందనే భయం దీనికి కారణంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..