పిల్లలకు తల్లి సరైన పద్ధతిలో పాలు మాన్పించకపోవడంతో, చాలా మంది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు.

తల్లి పాలు మాన్పించేందుకు పిల్లలకి మెల్లమెల్లగా ఘన రూపాల్లో ఆహారాన్ని అందిస్తూ, పాలపై ఆధారపడటాన్ని తగ్గించాలి.

సరైన సమయంలో, సరైన విధానంలో తల్లిపాలు మాన్పించే ప్రక్రియను ప్రారంభించడం చాలా ముఖ్యం.

‘‘ఆరు నెలల పాటు కేవలం పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలి. ఆ తర్వాత, తల్లి పాలు మాన్పించే ప్రక్రియను ప్రారంభించాలి

ఈ సమయంలో కేవలం పాలు మాత్రమే ఇస్తే, ఐరన్, ఇతర పోషకాలు వారి శరీరంలో లోపిస్తాయి. దీంతో వారు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తల్లిపాలను మాన్పించేందుకు రెండు విధానాలున్నాయి. ఒకటి పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయం. 

దీనిలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులే ఎప్పుడు పిల్లలకు ఘన ఆహారం ఇవ్వాలో నిర్ణయిస్తారు.

ఈ విధానంలో, లిక్విడ్ డైట్ లేదా మెత్తగా వండిన ఆహారాన్ని పిల్లలకు స్పూన్ లేదా చేతితో ఇస్తారు. ఈ విధానాన్ని ‘పేరెంట్-లెడ్ వీనింగ్’ అంటారు.

తల్లిపాలను మాన్పించే ప్రక్రియలో మరో విధానం ‘బేబీ-లెడ్ వీనింగ్’. ఇది 2000 దశకం ప్రారంభం నుంచి మొదలైంది.

పిల్లల కోసం ప్రత్యేకంగా వండిన లేదా గ్రైండ్ చేసిన లిక్విడ్ ఆహారాన్ని వారికి ఇవ్వడానికి బదులు.. కుటుంబంలోని మిగతా వారి కోసం ఏదైతే వండుతారో, దాన్నే వారికి పెడతారు.

వీరికి కొంత మొత్తంలో ఆహారాన్ని, మెత్తగా ఉండే ముక్కలు లేదా ముద్దలు పక్కకు తీసి వారికి ఉంచుతారు. ఆ తర్వాత పిల్లలు తమ చేతులతో తాము తినేలా చేస్తారు.

తల్లిపాలు మాన్పించేందుకు చేపట్టే వివిధ రకాల విధానాల్లో బరువు పెరగడానికి, ఆకలికి మధ్య ఎలాంటి తేడా లేదని న్యూజీలాండ్‌లో 206 శిశువులపై చేపట్టిన మరో పరిశోధన తేల్చింది.