Ambati Rambabu: నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. నన్ను అరెస్ట్ చేసినా ఐ డోంట్ కేర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని మాజీ మంత్రి అంటి రాంబాబు అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని.. తనను తిట్టినవారినే తిట్టానని చెప్పారు. తాజాగా గుంటూరులోని అంబటి ఇంటి ముందు తాజాగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ వయస్సులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తారు. ఆ విషయం తనకు తెలుసన్నారు. అయినా ఐ డోంట్ కేర్. అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు. తన చుట్టూ జరుగుతున్న విమర్శలు అన్నిటికీ సమాధానం చెబుతానని.. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.
కానీ మేమే ఏదో చేసినట్టు ఫ్లెక్సీలు కట్టారు.. ఆ ఫ్లెక్సీ లు తీసేయాలని గౌరవంగా చెప్పానన్నారు.
READ MORE: Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం..
Also Read
“ఈరోజు కూడా ఫ్లెక్సీ లు చించడానికి వెళ్ళలేదు.. వెంకన్న గుడికి పూజలు చేయడానికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేదారిలో అడ్డుకొని బూతులు తిట్టారు.. వాళ్ళు తిట్టారు కాబట్టే నేనే తిట్టాను. నేను చంద్రబాబు ను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదు.. ఆయన్ను ప్రజలు ఎన్నుకున్నారు నేనెందుకు తిడతాను. ఆయనో పెద్ద నాయకుడు అలా తిట్టి ఉండాల్సింది కాదు.. నా మీద దాడి చేశారు కాబట్టే అలా మాట్లాడాను. అది అనుకోకుండా జరిగిపోయింది.. చంపడానికి వస్తే నేను గావు కేక పెట్టాను అంతే. నన్ను అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే.. అరెస్టులను లెక్క చేయను.. అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నా. రాడ్లు, కర్రలతో దాడి చేస్తుంటే పోలీసులు ఆపగలిగారా? మమ్మల్ని కొట్టడానికి వస్తే వారికి రక్షణ కల్పిస్తారా? మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్కచేయదు.. నేను పారిపోను.. బెయిల్ కు వెళ్ళను. ఇంతమంది పోలీసులు ఉండి మా పై దాడులు చేసిన వారిని వదిలేసి మ్మమ్మల్నే అరెస్ట్ చేస్తారా?” అని అంబటి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!