Ishan Kishan: తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ తన కెరీర్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఇషాన్ అంతటితో ఆగలేదు. మరింత దూకుడు పెంచి కేవలం 42 బంతుల్లోనే తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. యువ ఆటగాడిగా ఈ ఘనత సాధించడం నిజంగా విశేషం.
READ MORE: IND vs NZ 5th T20: ఇషాన్ ఊచకోత.. కివీస్ టార్గెట్ ఎంతంటే?
మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌కు తగ్గట్టే ఆడాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేసి, ఇషాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌తో భారత స్కోర్ బోర్డు వేగంగా పరుగులు పెరిగింది. అంతకుముందు అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. సంజూ శాంసన్ మాత్రం ఈసారి పెద్దగా రాణించలేక పోయాడు. కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులకే అవుటయ్యాడు. మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే మారింది. పిచ్‌పై బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్ ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఇషాన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 272 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలదా? వేచిచూద్దాం..