Jowar Flour Snack Recipe: ఆరోగ్యంతో పాటు రుచిని కూడా కోరుకునే వారికి జొన్నపిండి నిప్పట్లు లేదా చెక్కలు బెస్ట్ స్నాక్ గా చెప్పవచ్చు. బయట దొరికే చెక్కలకంటే ఇవి మరింత కరకరగా, టేస్టీగా ఉండటమే కాదు.. ఆయిల్, ఉప్పు మనకు కావలిసినంత వేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాయి. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్‌గా కరకరలాడే జొన్నపిండి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
Motorola G77, G67 & Edge 70 Fusion ధరలు & స్పెక్స్ లీక్..
అవసరమైన పదార్థాలు:
* జొన్నపిండి – 2 కప్పులు
* నీళ్లు – ఒకటిన్నిర కప్పులు
* ఉప్పు – రుచికి సరిపడా
* కారం – 1 టీస్పూన్ (రుచికి తగ్గట్టుగా)
* జీలకర్ర – 1 టీస్పూన్
* పచ్చి నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
* పెసరపప్పు – పావు కప్పు (30 నిమిషాలు నానబెట్టి నీళ్లు వంపాలి)
* సన్నగా తరిగిన కరివేపాకు – తగినంత
* నూనె – 1 టేబుల్ స్పూన్ (పిండిలోకి) + వేయించడానికి కావలసినంత
ఫోన్‌నే ‘సెకండ్ బ్రెయిన్’గా మార్చిన Infinix’s.. XOS 16 AI ఆధారిత ఫీచర్లు మైండ్ బ్లోయింగ్
తయారీ విధానం:
ముందుగా స్టవ్‌పై అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని ఒకటిన్నిరకప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. నీళ్లు మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్లలో ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అన్నీ బాగా కలపాలి.
జొన్నపిండి కలపడం:
ఇప్పుడు అందులో 2 కప్పుల జొన్నపిండి వేసుకోవాలి. బయట కొన్న పిండి అయినా.. ఇంట్లో తయారు చేసినదైనా వాడుకోవచ్చు. వేడి నీళ్లలో పిండి కలపడం వల్ల పిండికి జిగురు వచ్చి, చెక్కలు చేసేప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. గరిటతో మాష్ చేస్తూ బాగా కలపాలి. మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చేతితో తాకగలిగేంత వేడి తగ్గిన తర్వాత పిండిని చేత్తో బాగా మర్దన చేస్తూ కలపాలి. అలా పిండి గట్టిగానే ఉండాలి. పల్చగా అనిపిస్తే కొంచెం జొన్నపిండి వేసుకోవచ్చు.
చెక్కలు తయారు చేసే విధానం:
పిండిని అవసరమైనంత కొంచెం కొంచెంగా తీసుకోవాలి. మొత్తం ఒకేసారి తీసుకోకండి.. అలా చేస్తే పిండి ఆరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత మీకు కావలసిన సైజ్‌లో ఉండలు చేసుకోండి. పెద్ద చెక్కలు కావాలంటే పెద్ద ఉండలు తీసుకోండి. చిన్న చెక్కలు కావాలంటే చిన్న ఉండలు తీసుకోండి.
ఫ్లయింగ్ డిస్ప్లేలు, డ్రోన్ షోలు.. Wings India 2026తో ఏవియేషన్ రంగానికి కొత్త ఊపు!
ఆపై బట్టర్ పేపర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకుని కొంచెం నూనెతో గ్రీస్ చేయాలి. ఫ్లాట్ అడుగు ఉన్న గిన్నెకు కూడా కవర్ పెట్టి, ఒక్కొక్క పిండి ముద్దను పెట్టి గట్టిగా నొక్కాలి. ఇలా చేస్తే చెక్కలు ఈజీగా వస్తాయి. పూరి ప్రెస్ ఉంటే దానితోనూ చేయవచ్చు. తయారైన చెక్కలను బాగా నీళ్లు పిండిన తడి గుడ్డపై వేసుకోవాలి. కడాయిలో నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా కాగనివ్వాలి. ఒక్కొక్క చెక్కను నూనెలో వేయాలి. ముందు వేసింది పైకి వచ్చిన తర్వాతే రెండోది వేయాలి. అలా వేసిన వెంటనే కలపకూడదు. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత మెల్లగా తిప్పాలి. హై ఫ్లేమ్ లో వేయిస్తే పైనే రంగు వచ్చి లోపల మెత్తగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీడియం ఫ్లేమ్ లోనే వేయించాలి. బాగా క్రిస్పీగా అయ్యాక నూనెలో నుంచి తీసి వడారనివ్వాలి. చెక్కలు తీసిన వెంటనే ఫ్లేమ్ తగ్గించాలి, లేదంటే నూనె మరీ వేడెక్కిపోతుంది.
స్టోరేజ్ & సర్వింగ్ టిప్స్:
చెక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రం టీతో కానీ, పిల్లలకు స్నాక్ గా కానీ ఇవి సూపర్‌గా ఉంటాయి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మర్చిపోకండి!