Chiranjeevi: రామ్‌చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!
- మరోసారి తల్లిదండ్రులైన రామ్‌చరణ్, ఉపాసన దంపతులు
- మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఉపాసన
- మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మెగా పవర్ స్టార్’ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో ‘మెగా’ కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యింది. కొణిదెల కుటుంబంతో పాటు కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. మరోవైపు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చారని రాత్రే ఎక్స్ వేదికగా వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈరోజు అపోలో హాస్పిటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగం చెందారు.
చిరంజీవి మాట్లాడుతూ… ‘చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. రామ్‌చరణ్–ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతో పాటు బిడ్డలు ఇద్దరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఎప్పటి నుంచో, ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలి అని ఎంతో మంది కోరుకున్నారు. ఆ భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఈ శుభవార్తను మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులు ఇంతగా ఆనందం వ్యక్తం చేయడం మా కుటుంబానికి ఎంతో ఆనందం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
Also Read: Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్‌కప్‌కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!
మెగా కుటుంబంలో కొత్త అతిథుల రాకతో ఆనందం రెట్టింపు అయింది. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్‌చరణ్, ఉపాసనలు 2012లో వివాహం చేసుకున్నారు. వారికి 2023 జూన్ 20న క్లీంకార కొణిదెల జన్మించిన విషయం తెలిసిందే. శనివారం (2026 జనవరి 31) కవల పిల్లలు జన్మించారు. అపోలో హాస్పిటల్‌లో కవలలతో మెగా పవర్ స్టార్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఇటు వారసుడు రావడంతో చిరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!