Pakistan: పాక్‌లో “ధురంధర్”ల హవా.. పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..
- పాక్‌లో "ధురంధర్"ల హవా..
- పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..
- డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హవా కొనసాగుతోంది. భారత వ్యతిరేకులు ఎక్కడ ఉన్న వెతికి వెంటాడి వేటాడి మట్టపెట్టుడుతున్నారు. అజ్ఞాత ‘‘ధురంధర్‌లు’’ పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులు, భారత్‌కు వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్న వ్యక్తులను లేపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, 26 మందిని బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడి హ్యాండ్లర్‌గా భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం సంచలనంగా మారింది. పాక్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ లో అతడి కారుపై కాల్పులు జరిపి, హతమార్చారు. అయితే, ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కకపోవడం గమనార్హం. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత దగ్గరి వ్యక్తి.
Read Also: Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
బుధవారం డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ బలిదానం విషాదకర సంఘటన అని చెప్పారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు పాక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!