Ishan Kishan Century: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎలైట్ లిస్ట్‌లో ఇషాన్ కిషన్!
- ఐదవ టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీ
- ఎలైట్ లిస్ట్‌లో ఇషాన్ కిషన్
- ఐదవ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ఇలాంటి ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఈ అరుదైన ఘనత సాధించిన బ్యాటర్ల సరసన చేరాడు. శనివారం రాత్రి తిరువనంతపురంలో న్యూజీలాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో కిషన్ (103; 43 బంతుల్లో 6×4, 10×6) మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో శతకం బాదిన కిషన్ భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఐదవ బ్యాటర్‌గా నిలిచాడు.
భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదాడు. రెండో స్థానంలో యువ ఓపెనర్ అబిషేక్ శర్మ ఉన్నాడు. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో అతడు 37 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకం సాధించిన సంజూ శాంసన్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో శతకం సాధించిన తిలక్.. యువ ఆటగాళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌పై 42 బంతుల్లో శతకం సాధించిన ఇషాన్ కిషన్ ఈ ఎలైట్ జాబితాలో ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు.
Also Read
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
Also Read: BRS Protests: కేసీఆర్ సిట్ విచారణ వేళ బీఆర్ఎస్ భారీ స్కెచ్!
న్యూజిలాండ్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ భారత్ తరఫున వేగవంతమైన శతకాలు సాధించిన అగ్ర బ్యాటర్ల సరసన చేరాడు. ఇది అతడి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. భారత టీ20 జట్టు బ్యాటింగ్ లోతు, దూకుడు ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. తాజా ప్రదర్శనతో కిషన్ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడం ఖాయం అయింది. వరుస వైఫల్యాలతో సంజు శాంసన్ తన చోటును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. తిలక్ వర్మ జట్టులోకి వస్తే.. సంజు బెంచ్‌లోనే ఉండాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?