టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్‌తో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు, ముఖ్యంగా ఆయన ఎంచుకుంటున్న దర్శకుల జాబితా చూస్తుంటే, బన్నీ చూపు పూర్తిగా పొరుగు రాష్ట్రం వైపు మళ్లిందా? అనే చర్చ మొదలైంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో అల్లు అర్జున్ ఒకరు, ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తనను స్టార్‌గా మార్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన తెలుగు దర్శకులను వదిలి, బన్నీ ప్రస్తుతం తమిళ దర్శకులకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి, నిజానికి ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాయి.
Also Read:Kishore Tirumala: కీర్తి సురేశ్ కోసం ఆ స్టార్ హీరోయిన్‌కు మస్కా కొట్టాను : డైరెక్టర్ కిషోర్ తిరుమల
అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది, త్రివిక్రమ్‌ను లైట్‌గా తీసుకున్న బన్నీ, తన తదుపరి ప్రయాణాన్ని కోలీవుడ్ డైరెక్టర్లతో కొనసాగించాలని ఫిక్స్ అయ్యారు. మరోవైపు, బన్నీ ప్లేస్‌లోకి ఎన్టీఆర్‌ను తీసుకొచ్చి గురూజీ తన పనిలో తాను బిజీ అయిపోయారు, ప్రస్తుతం అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్‌కు ‘జవాన్’ వంటి వెయ్యి కోట్ల హిట్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు, ఈ సినిమాలో బన్నీ ఒక సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఫుల్ ఫామ్‌లో ఉన్న అట్లీతో సినిమా అనగానే అభిమానులు ఖుషీ అయ్యారు, కానీ, ఆ తర్వాత ఆయన తీసుకున్న మరో నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అట్లీ తర్వాత అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేశ్, ఇటీవల ‘లియో’తో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు.
Also Read:Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!
రజనీకాంత్ ‘కూలీ’ విషయంలోనూ మిశ్రమ స్పందన వస్తోంది, ఇలాంటి సమయంలో, ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడికి బన్నీ ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, లోకేశ్ చెప్పిన కథలోని కొత్తదనం చూసి, హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బన్నీ ఫిదా అయినట్లు తెలుస్తోంది. వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు చేయాలని బన్నీ నిర్ణయించుకోవడం వెనుక తన గ్లోబల్ మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలనే ఆలోచన ఉండవచ్చు, అయితే, మన తెలుగు దర్శకులను కాదని ‘తమిళ తంబీల’పైనే బన్నీ ఎందుకు అంత నమ్మకం ఉంచుతున్నారో కాలమే సమాధానం చెప్పాలి.