KCR vs SIT: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద హడావుడి నెలకొంది. సిట్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. నందినగర్ నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనని విచారించవచ్చన్న విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్ కే రావాలని సిట్ అధికారులు అంటున్నారు. సిట్ నోటీసులపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం కేసీఆర్ తీసుకుబోయే నిర్ణయంపై ఉత్కంఠ చెలరేగుతుంది.
Read Also: India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’తో పాకిస్తాన్‌లో భయం మొదలు..
అయితే, నిన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో గులబీ బాస్ కేసీఆర్ సమావేశం అయ్యారు. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు ఉన్నారు. నేడు మరోసారి BRS కీలక నేతలతో బీఆర్ఎస్ చీఫ్ సమావేశం కానున్నారు. మరోవైపు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల ప్రోగ్రాం కొనసాగుతుంది. కేటీఆర్ సమక్షంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పార్టీ కండువా కప్పుకోనున్నారు.