Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి .. టాలీవుడ్ నిర్మాతల డైలమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ‘కాంతార’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తెలుగులో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి ఈ ఏడాది తన పూర్తి సమయాన్ని కేవలం ఈ రెండు ప్రాజెక్టులకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇతర ఏ కొత్త సినిమాలకు ఆయన డేట్స్ ఇవ్వడం లేదు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఈ సినిమాల కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!
Also Read
సాధారణంగా హీరోలు లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిలో పనిచేయాలని నిర్మాతలు కోరుతుంటారు. కానీ, రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం విన్న టాలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా విస్తుపోయారు. దీంతో జాతీయ అవార్డు గ్రహీతగా ఆయనకు ఉన్న క్రేజ్, ‘కాంతార’తో సాధించిన మార్కెట్ దృష్ట్యా ఈ స్థాయి రెమ్యునరేషన్ అడగడం సమంజసమే అని కొందరు అంటుంటే, నిర్మాతలు మాత్రం బడ్జెట్ భారం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పారితోషికం విషయంలో రిషబ్ తగ్గకపోవడంతో, నిర్మాతలు ఆయన అడిగినంత ఇవ్వడానికి మొగ్గు చూపుతారా లేదా లాభాల్లో వాటా పద్ధతికే ఒప్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు రిషబ్ శెట్టి వంటి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్‌తో పని చేయడానికి సిద్ధమవుతున్న వేళ, ఈ ఆర్థికపరమైన చర్చలు ఎక్కడ ముగుస్తాయో వేచి చూడాలి
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!