Rupee Breakup: ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తోంది? ఎటు పోతోంది? పూర్తి వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rupee Breakup: కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఒక లెక్క. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఏ వనరు నుంచి ఎంత వస్తోంది, అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తోందనే ఆసక్తికర విషయాలను ప్రభుత్వం వెల్లడించింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..
Union Budget 2026: కేంద్రం బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ప్రభుత్వ ఆదాయం – రూపాయి రాక (Rupee Comes From):
ప్రభుత్వానికి ఆదాయం ప్రధానంగా పన్నులు, అప్పుల ద్వారా లభిస్తుంది.
* అప్పులు, ఇతర రుణ బాధ్యతలు: 24 పైసలు (ప్రభుత్వానికి ఇదే పెద్ద ఆదాయ వనరు).
* ఆదాయపు పన్ను (Income Tax): 21 పైసలు.
* కార్పొరేషన్ పన్ను (Corporation Tax): 18 పైసలు.
* జీఎస్టీ (GST), ఇతర పన్నులు: 15 పైసలు.
* పన్నేతర ఆదాయం (Non-Tax Revenue): 10 పైసలు.
* కేంద్ర ఎక్సైజ్ సుంకం: 6 పైసలు.
* కస్టమ్స్ సుంకం: 4 పైసలు.
* రుణేతర మూలధన వసూళ్లు: 2 పైసలు.

Union Budget 2026-27: ఏ రంగానికి ఎంత? రవాణా, రక్షణ రంగాలకు పెద్దపీట!
ప్రభుత్వ వ్యయం – రూపాయి పోక (Rupee Goes To):
ప్రభుత్వం సేకరించిన ఆదాయాన్ని దేశాభివృద్ధి, పరిపాలన కోసం కింది విధంగా ఖర్చు చేస్తోంది.
* రాష్ట్రాల వాటా (పన్నులు & సుంకాలు): 22 పైసలు.
* వడ్డీ చెల్లింపులు: 20 పైసలు (గతంలో చేసిన అప్పులకు చెల్లించే వడ్డీ)
* కేంద్ర రంగ పథకాలు: 17 పైసలు.
* రక్షణ రంగం (Defence): 11 పైసలు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలు (Centrally Sponsored): 8 పైసలు.
* ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు & ఇతర బదిలీలు: 7 పైసలు.
* ఇతర ఖర్చులు: 7 పైసలు.
* సబ్సిడీలు (Subsidies): 6 పైసలు
* పెన్షన్లు (Pensions): 2 పైసలు.

Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
ఈ గణాంకాలను గమనిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల (Income Tax & Corp Tax) వాటా కీలకంగా ఉంది. మరోవైపు ప్రభుత్వం చేసే వ్యయంలో వడ్డీ చెల్లింపులకే (20 పైసలు) అత్యధికంగా ఖర్చు అవుతుంది. రక్షణ రంగానికి (11 పైసలు) ప్రాధాన్యతనిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చే కేంద్ర పథకాలపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో దృష్టి సారించింది. ఈ బడ్జెట్ ద్వారా ‘వికసిత భారత్’ దిశగా అడుగులు వేస్తూ, ఆర్థిక లోటును అదుపులో ఉంచుతూనే అభివృద్ధిని సమతుల్యం చేసేందుకు ప్రయత్నించారు.
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!