మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు(శనివారం) పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఆమె రికార్డ్ సృష్టించారు. అజిత్ పవార్ మరణం తర్వాత మూడు రోజులకే ఆమె అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. ఎన్సీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రమాణస్వీకారం జరిగింది. సునేత్ర ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎన్సీపీ నేతలు ‘‘అజిత్ పవార్ అమర్ రహే’’ అని నినదించారు.
నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. నన్ను అరెస్ట్ చేసినా ఐ డోంట్ కేర్..
చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని మాజీ మంత్రి అంటి రాంబాబు అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని.. తనను తిట్టినవారినే తిట్టానని చెప్పారు. తాజాగా గుంటూరులోని అంబటి ఇంటి ముందు తాజాగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ వయస్సులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తారు. ఆ విషయం తనకు తెలుసన్నారు. అయినా ఐ డోంట్ కేర్. అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు. తన చుట్టూ జరుగుతున్న విమర్శలు అన్నిటికీ సమాధానం చెబుతానని.. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. కానీ మేమే ఏదో చేసినట్టు ఫ్లెక్సీలు కట్టారు.. ఆ ఫ్లెక్సీ లు తీసేయాలని గౌరవంగా చెప్పానన్నారు.
ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు..
భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లతో సతమతమవుతోంది. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉండాల్సిన సంఖ్య కన్నా ఇది తక్కువ. సకాలంలో న్యాయం జరగాలంటే జనాభాకు తగినంత మంది జడ్జీలు లేరని తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2026 నాటికి ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు కేంద్రం తెలిపింది. అధికారిక వివరాల ప్రకారం, సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారు. హైకోర్టులో 1122 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ ప్రస్తుతం 814 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక కేసులు జిల్లా, దిగుమ కోర్టుల్లోనే ఉన్నాయి. ఈ కోర్టుల్లో 20,833 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అయినా కూడా పెండింగ్ కేసులు తగ్గించడానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సిట్‌కు కేసీఆర్ 6 పేజీల ఘాటు లేఖ.. నోటీసులు అక్రమం.. అయినా విచారణకు వస్తా.!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత, మాసీ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘంగా రాసిన ఆరు పేజీల లేఖలో ఆయన పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని తన నంది నగర్ నివాసం గోడపై నోటీసును అతికించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జూబ్లీహిల్స్ ఏసీపీకి తనపై ఇటువంటి నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
హీరోయిన్ విషయంలో అనిల్ రావిపుడిని హెచ్చరిస్తున్న నెటిజన్లు ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటారు. సంక్రాంతి సీజన్ అంటే చాలు అనిల్ రావిపూడికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో తాజాగా తన తదుపరి సినిమా గురించి అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘నా నెక్స్ట్ సినిమా కోసం ఒక అదిరిపోయే ఐడియా దొరికింది. ఈసారి సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే మీరంతా షాక్ అవుతారు. ఆ పేరు వినగానే.. ‘వామ్మో వీడేంట్రా బాబూ.. మళ్ళీ ఏదో కొత్తగా మొదలుపెట్టాడు’ అని మీరు అనుకోవడం ఖాయం’ అని నవ్వుతూ చెప్పారు. అంటే, ఈసారి టైటిల్ చాలా విచిత్రంగా, మునుపెన్నడూ వినని విధంగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. అనిల్ రావిపూడికి, విక్టరీ వెంకటేష్‌కి ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు (ఇందులో వెంకీ కీలక పాత్ర చేశారు) వంటి నాలుగు హిట్లు వచ్చాయి.
రేపే గురు రవిదాస్ జయంతి.. డేరా సచ్‌ఖండ్ బాలన్‌ను సందర్శించనున్న ప్రధాని మోడీ
గురు రవిదాస్ జయంతి రేపు (ఫిబ్రవరి 1, 2026న) జరుపుకుంటారు. గురు రవిదాస్ ప్రఖ్యాత కవి, సంఘ సంస్కర్త. అనేక సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన కృషి చేశారు. సమాజంలో ప్రబలంగా ఉన్న వివక్షకు వ్యతిరేకంగా కూడా ఆయన తన స్వరాన్ని వినిపించారు. భక్తి ఉద్యమంలో చేరడం ద్వారా, ఆయన సమాజం నుండి కుల వివక్షను తొలగించారు. ఆయన తన శ్లోకాలు, ద్విపదల ద్వారా సమానత్వం, దేవుని పట్ల భక్తి సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. నిజమైన హృదయమే నిజమైన మతం అని ప్రజలను ఒప్పించడానికి ఆయన పదే పదే ప్రయత్నించారు. గురు రవిదాస్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మాఘ పూర్ణిమ నాడు జన్మించారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని పౌర్ణమి తేదీ రేపు ఉదయం ప్రారంభమవుతుంది. అందువల్ల, గురు రవిదాస్ జన్మదినోత్సవం ఫిబ్రవరి 1న జరుపుకుంటున్నారు.
కోఠి కాల్పుల కేసులో పురోగతి.. వేట మొదలుపెట్టిన ప్రత్యేక బృందాలు.!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శుక్రవారం ఉదయం జరిగిన తుపాకీ కాల్పులు, భారీ దోపిడీ ఉదంతం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏటీఎం సెంటర్‌లో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారిపై కాల్పులు జరిపి ₹6 లక్షలు దోచుకెళ్లిన ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. నిందితులిద్దరూ నేరం చేసిన వెంటనే అత్యంత వ్యూహాత్మకంగా నగరం విడిచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన రిన్‌షాద్ అనే 26 ఏళ్ల యువ వస్త్ర వ్యాపారి, సరుకు కొనుగోలు కోసం తన వద్ద ఉన్న ₹6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి శుక్రవారం ఉదయం కోఠిలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎానికి చేరుకున్నారు. ఆయన నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి తుపాకీతో బెదిరించారు. రిన్‌షాద్ వారిని ప్రతిఘటించడంతో దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఒక బుల్లెట్ ఆయన కుడి కాలికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇదే తరుణంలో దుండగులు నగదు బ్యాగుతో పాటు ఆయన వాహనాన్ని కూడా తీసుకుని చాదర్‌ఘాట్ వైపు వేగంగా తప్పించుకున్నారు.
మాజీ మంత్రి ఇంటి వద్ద క్షణక్షణం ఉద్రిక్తత.. అంబటికి ఫోన్ చేసిన వైఎస్ జగన్
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిదగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తతగా మారుతోంది. టీడీపీ శ్రేణులు అక్కడే మోహరించారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతలవారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటూ టీడీపీ కేడర్ మండిపడుతోంది. ఓపక్క పోలీసులు.. ఇంకోపక్క టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి ఇంట్లోనే ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాజీ మంత్రికి ఫోన్ చేశారు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అంబటికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్, ఆయనకు ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం అంబటి రాంబాబు వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడు..తూ రాష్ట్రం పూర్తిగా జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంలా నడుపుతున్నారని విమర్శించారు. రోజురోజుకూ చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన రియాక్షన్..
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. “వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాత్తు శ్రీవారి సొమ్ము రూ. 250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో ఆవు నెయ్యి బదులుగా, 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడటమే కాకుండా, SIT రిపోర్ట్ ద్వారా 36 మంది ఈ పాపంలో భాగం అయ్యారు అని చెప్పినా సరే ప్రభుత్వంపై నిందలు వేస్తారా? మీరు చేసిన తప్పులు ప్రజలకు వివరించేలా ఫ్లెక్సీలు వేయిస్తే రౌడీయిజంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారా? మీరు చేసేది తప్పు అని అడ్డుకుంటే సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తారా? అంబటి చేసినవి విమర్శలు కాదు, ఇది తప్పు చేసిన మమ్మల్ని ఏమీ చేయలేరు అనే అహంకారంతో వాగిన చిల్లర వాగుడు… YSR బూతు పార్టీ నాయకుడిగా బండ బూతులతో రెచ్చి పోయిన అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడలేకపోతే ఇక సామాన్యులపై జరిగే దాడులను ఎలా అరికడతాం? ఒక మాజీ మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన అంబటి రాంబాబు బజారు రౌడీలా ప్రవర్తిస్తే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లు? రాష్ట్ర ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి పోలీసులు అరెస్ట్ చేయాలి.. భవిష్యత్తులో ఇలా మరే ఇతర నాయకుడు ప్రవర్తించకుండా న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి.” అని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
ఇలా రెచ్చిపోయావేంటి భయ్యా.. బౌలర్లకు చుక్కలు చూపిన ఇషాన్ కిషన్.. నయా రికార్డ్!
తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ తన కెరీర్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఇషాన్ అంతటితో ఆగలేదు. మరింత దూకుడు పెంచి కేవలం 42 బంతుల్లోనే తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. యువ ఆటగాడిగా ఈ ఘనత సాధించడం నిజంగా విశేషం.