Sanju Samson: సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా?.. ఇక ఐపీఎల్‌లో ఆడుకోవాల్సిందేనా?
- మరోసారి సోషల్ మీడియాలో సంజూ శాంసన్ పేరు చర్చ
- న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమైన సంజూ
- వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా కిషన్
- సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిభ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజూ.. అవకాశాలు వచ్చిన ప్రతిసారి వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు న్యూజీలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడమే. 5 మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. 9.2 సగటుతో 46 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనతో ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టమే.
వరుసగా మారిన కోచింగ్ ఎరాల్లోనూ సంజూ శాంసన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో సంజూకు సరైన స్థిరత్వం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ యుగంలోనూ అవకాశాలు పొందినప్పటికీ.. కీలక మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించలేకపోయాడనే అభిప్రాయం ఏర్పడింది. తాజాగా గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలోనూ అతడి ప్రదర్శన మెరుగుపడకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చింది. సంజూ ప్రదర్శన అభిమానులు, విశ్లేషకుల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. వచ్చిన అవకాశాలను చేతులారా వృథా చేసుకున్నాడు? అనే అభిప్రాయాన్ని ఫాన్స్ అంటున్నారు.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
Also Read: Ishan Kishan Century: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎలైట్ లిస్ట్‌లో ఇషాన్ కిషన్!
సంజూ శాంసన్ ప్రదర్శన టీ20 వరల్డ్ కప్ 2026పై కూడా ప్రభావం పడుతోంది. ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకుంటే.. సంజూను టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఆటగాళ్లు, ఫామ్‌లో ఉన్న బ్యాటర్లకు అవకాశాలు ఇవ్వాలని నెటిజెన్స్ అంటున్నారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ, సెంచరీతో సత్తాచాటాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా కిషన్ ఆడడం దాదాపుగా ఖాయం అయింది. సంజూ ఇక బెంచ్‌కే పరిమితం కానున్నాడు. వరల్డ్‌కప్ అనంతరం అతడు జట్టుకు ఎంపిక కాకపోవచ్చు. మొత్తానికి సంజూ టీ20 కెరీర్ ముగిసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!