IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK U19: అండర్ 19 ప్రపంచకప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నమెంట్‌లోని 36వ మ్యాచ్‌లో భారత్ అండర్–19 జట్టు, పాకిస్తాన్ అండర్–19 జట్టుతో తలపడనుంది. సూపర్ సిక్స్ దశలో భాగంగా ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న జింబాబ్వేలోని బులవాయోలో ఉన్న క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. సూపర్ సిక్స్ గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్ రెండూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..
Also Read
ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పాకిస్తాన్ నాలుగు సార్లు విజయం సాధించింది. భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్‌లో గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరడంతో, భారత్ లేదా పాకిస్తాన్‌లో ఒక్క జట్టుకే చివరి నాలుగులో స్థానం దక్కనుంది. దీంతో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇటీవల జరిగిన అండర్–19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడగా.. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచకప్ వేదికగా అదే ప్రత్యర్థిపై గెలిచి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్లో అందుబాటులో ఉంటుంది. అయితే నేడు బులవాయోలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రోజంతా ఎండమావులు కనిపించే అవకాశం ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండనుంది.
Sanju Samson: సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా?.. ఇక ఐపీఎల్‌లో ఆడుకోవాల్సిందేనా?
భారత్ U19 జట్టు:
ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఉదవ్ మోహన్, ఆర్.ఎస్. అంబ్రిష్, మొహమ్మద్ ఎనాన్, హర్వంశ్ పాంగలియా.
పాకిస్తాన్ U19 జట్టు:
హమ్జా జహూర్, సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, హుజైఫా అహ్సన్, అబ్దుల్ ఖాదిర్, అబ్దుల్ సుభాన్, మొమిన్ ఖమర్, మొహమ్మద్ సయ్యామ్, అలీ రజా, ఉమర్ జైబ్, అలీ హసన్ బలోచ్, దానియాల్ అలీ ఖాన్, నికాబ్ షఫీక్.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!