గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గోధము గడ్డిలో విటమిన్‌-ఎ, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్‌, క్లోరోఫిల్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ రసం తాగితే అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. 

గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం, శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. 

ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.  శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి. 

2011లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. 

గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వీట్‌గ్రాస్ మలబద్ధకం, ఇరిటేటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌ వంటి జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. 

గోధుమ గడ్డి జ్యూస్‌ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 

దీనివల్ల ఎర్ర రక్తకణాలు, హీమోగ్లోబిన్‌, తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరిగిందట. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్‌ హీమోగ్లోబిన్‌ నిర్మాణాన్ని పోలి ఉండి, అచ్చం దానిలానే పనిచేస్తుందట. 

ముఖ్యంగా కీమోథెరపీ సమయంలో గోధుమ గడ్డి రసం తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌ కణాలను సైతం నాశనం చేస్తుంది. 

గోధుమ గడ్డిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది అర్థరైటిస్‌ కారణంగా వచ్చే బోన్‌ స్టిఫ్‌నెస్‌, నొప్పి, వాపు వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది. 

గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ ఇన్ప్లమేషన్‌ను తగ్గిస్తుందని టెస్ట్-ట్యూబ్ అధ్యయనాలు స్పష్టం చేశాయి.