Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ గురువారం ఒక ‘బ్లాక్ థర్స్డే’గా మిగిలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్
ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $112 మార్కును దాటింది. ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు.
1800 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఈ రోజు సెన్సెక్స్ దాదాపు 1,800 పాయింట్లు (2.35%) పతనమై 74,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఏకంగా 532 పాయింట్లు (2.23%) నష్టపోయి 23,238 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు లాభాలతో ఊరించిన మార్కెట్, ఈరోజు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ పతనం కేవలం కొన్ని కంపెనీలకే పరిమితం కాలేదు. లార్జ్-క్యాప్ నుంచి స్మాల్-క్యాప్ వరకు అన్ని విభాగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ (L&T) వంటి బలమైన స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. నేడు ట్రేడ్ అయిన 2,006 స్టాక్స్‌లో 1,390 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. కేవలం 469 స్టాక్స్ మాత్రమే లాభాల్లో నిలవగలిగాయి. 40 స్టాక్స్ ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడే వరకు మార్కెట్‌లో ఇదే విధమైన హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!