Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. కారణాలు ఇవే..
- మూడు రోజుల లాభాలకు బ్రేక్..
- ఒక్కసారిగా కుప్పకూలిన ఇండియన్ స్టాక్ మార్కెట్..
- రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తాయనుకుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం నేడు ‘బ్లడ్ బాత్’ (భారీ పతనం)తో షాక్ ఇచ్చింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి, సెన్సెక్స్ లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ భారీ పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్, ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడులు చేయడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. దీనివల్ల భారత్ లాంటి దేశాల ఇంధన భద్రతపై ఎఫెక్ట్ పడుతోంది. భారత్ తన ఎల్‌ఎన్‌జీ (LNG) అవసరాల్లో దాదాపు 47 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
ముడిచమురు ధరల మంట
చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరగడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 3 శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 92.89 వద్ద కనిష్ఠానికి పడిపోవడం మరో ప్రధాన కారణం. కరెన్సీ బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
Also Read:Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్ విడుదల..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం.. యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే హెచ్చరికలు అమెరికా మార్కెట్లను దెబ్బతీశాయి. దాని ప్రభావంతో జపాన్ (Nikkei), దక్షిణ కొరియా (Kospi) మార్కెట్లు కూడా 2 శాతం పైగా నష్టపోవడం భారత మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
గత మూడు రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో.. ప్రస్తుత అనిశ్చితిని చూసి ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారు. దీనివల్ల అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు మరింతగా పతనమయ్యాయి. భారతదేశ ఇంధన అవసరాలకు కీలకమైన ఖతార్‌పై దాడి జరగడం, దానివల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటమే నేటి ‘బ్లడ్ బాత్’కు అసలు సిసలు కారణం. కేవలం ఒక్క రోజులోనే రూ. 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!