Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి కథ ఇది. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్లడానికి అంగీకరించాడు. అసలేం జరిగిందంటే.. రాజ్‌కుమార్ భార్యకు వేరొకరితో సంబంధం ఉండేది. ఈ విషయంలో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. గత ఏడాది జూలైలో.. తన ఆరు నెలల బిడ్డను కూడా వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నిజానికి ఆమె తన ప్రియుడితో కలిసి ఉంటోందని రాజ్‌కుమార్ తెలుసుకున్నాడు. తాను ప్రశ్నించినప్పుడల్లా.. నేను అలా చేస్తున్నట్లు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తూ.. భర్తకు ఎదురు తిరిగి మాట్లాడేది. దీంతో అతడు ఏమి చేయలేక ఉండేవాడు.
ఫోన్‌లో షాకింగ్ విషయాలు..
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఇటీవల ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా, రాజ్‌కుమార్ ఆ ఫోన్‌ను లాక్కున్నాడు. అందులో ఉన్న విషయాలు చూసి అతనికి వెన్నులో వణుకు పుట్టింది. ఫేస్‌బుక్‌లో హత్యలకు సంబంధించిన కథనాలు, కొన్ని ఫోటోలతో పాటు.. రాజ్‌కుమార్ ఫోటో కింద ‘నీలం రంగు డ్రమ్ మరియు సిమెంట్’ అని రాసి ఉండటాన్ని అతను గమనించాడు. తనను చంపి, డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో నింపేస్తారనే భయం అతనికి కలిగింది.
గతంలో జరిగిన దారుణం..
ఈ ‘నీలం డ్రమ్’ విషయం వినగానే అందరికీ 2025 మార్చిలో జరిగిన ఒక దారుణ హత్య గుర్తుకు వస్తుంది. అప్పట్లో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి… శరీరాన్ని ముక్కలుగా చేసి, ఒక నీలం డ్రమ్ములో వేసి సిమెంట్‌తో నింపేసింది. సరిగ్గా తన భార్య కూడా తనను అలాగే బెదిరించేదని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజ్‌కుమార్ భార్య ఇంట్లో పనులు చేసేది కాదు.. కనీసం చిన్న బిడ్డను కూడా పట్టించుకునేది కాదు. తనను.. తన తమ్ముళ్లను చంపేస్తానని బెదిరించేది. చివరికి రాజ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్‌లో రాజీ ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా.. ఆమె తన ప్రియుడితోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో రాజ్‌కుమార్ తన భార్య ప్రియుడిని పిలిపించి.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమెను అతనితో వెళ్లడానికి అనుమతించాడు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!