AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
- మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 సందడి మొదలు
- మార్చి 28న ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆరంభం
- ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మొదలు కానుంది. మార్చి 28న లీగ్ మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రోఫీని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాడు. ఆర్సీబీ జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదని డివిలియర్స్ స్పష్టం చేశాడు.
ఆర్సీబీ విజయవకాశాల గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదు. ఆర్సీబీ జట్టులో పోరాడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారంతా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇదే సమతూకం వారిని మళ్ళీ విజేతలుగా నిలుపుతుంది’ అని అభిప్రాయపడ్డాడు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
Also Read: Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!
డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ తరచూ చెప్పే మాటలను డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. ‘మనం ఒక్కసారి కప్పు గెలిస్తే చాలు.. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు, నాలుగు ట్రోఫీలు సులువుగా గెలవగలమని విరాట్ ఎప్పుడూ చెబుతుండేవాడు. కోహ్లీ మాటలను నేను పూర్తిస్థాయిలో నమ్ముతున్నా. ఆర్సీబీ ఈసారి దుమ్మురేపడం ఖాయం. రాబోయే సీజన్లలో బెంగళూరు వరుస విజయాలతో చరిత్ర సృష్టిస్తుంది’ అని ఏబీడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్, డివిలియర్స్ కలిసి చాలా ఏళ్లు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!