Off The Record : తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ రచ్చ ముగిసినట్టేనా ?
- జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే ఈసారి 100 సీట్లు గెలుస్తామన్న కోమటిరెడ్డి
- కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి మాటల కుదుపు
- వెంటనే అలర్ట్ అయి వివరణ ఇచ్చిన మంత్రి వెంకటరెడ్డి
- మహేష్‌గౌడ్‌ని తొలగించాలన్నది తన ఉద్దేశ్యం కాదని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ రచ్చ ముగిసినట్టేనా? అది టీ కప్పులో తుఫానేనా? లేక ఇంకా ఇంటర్నల్ మేటర్స్ ఏమన్నా ఉన్నాయా? అసలా మంత్రి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏ సందర్భంలో, ఏ ఉద్దేశ్యంతో అన్నారాయన? దాన్ని పీసీసీ అధ్యక్షుడి టీమ్, కొన్ని సంఘాలు ఎందుకంత సీరియస్‌గా తీసుకున్నాయి? ఇంతకీ మంత్రి ఏమన్నారు? ఆ మాటలు ఎట్నుంచి ఎటు వెళ్ళాయి? తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ కొత్త వివాదం కుదిపేసింది. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటే… వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి. అది పార్టీలో ఓ చిన్నపాటి రచ్చకు కారణమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరో మంత్రి కూడా స్పందించడంతో ఎదుటి పక్షం వ్యవహారాన్ని కాస్త సీరియస్‌గానే తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు మద్దతుగా ఒకరిద్దరు నేతలు మీడియా ప్రకటనలు కూడా విడుదల చేశారు. దాంతో… ఇదంతా ఎట్నుంచి ఎటెటో పోతోందన్న కంగారు ఒక దశలో పార్టీ వర్గాల్లో మొదలైంది. అటు జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకువచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా… వెంటనే అలర్ట్ అయిపోయి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పిసిసి చీఫ్‌గా ఉన్న మహేష్ గౌడ్‌ని తొలగించాలన్నది తన ఉద్దేశం కాదని, ఆయన తనకు మంచి మిత్రుడని కూడా చెప్పుకొచ్చారు.
దాంతో ఆ వ్యవహారం కొంత కొలిక్కి వచ్చినట్టేనన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే అసలు వివాదం ఆ స్థాయిలో ఎందుకు రేగిందని అంటే…. బీసీ సంఘాల రియాక్షన్ వల్లేనన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. అందుకే మేటర్ సీరియస్ అయిందని అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్ష పదవి నుంచి బీసీ నాయకుడిని తొలగించే కుట్ర జరుగుతోందా… అన్న లెవెల్‌లో స్పందించాయి బీసీ సంఘాలు. ఒకవైపు బీసీ సంఘాలు, మరోవైపు మహేష్ గౌడ్ సన్నిహితులు తీవ్రగా రియాక్ట్ అవడంతో… మంత్రి స్టేట్‌మెంట్ చుట్టూ రచ్చ జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, జగ్గారెడ్డి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఇచ్చిన ఇఫ్తార్ విందును చూసి అలా అన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. పైగా… మహేష్‌గౌడ్‌కి వ్యతిరేకంగా మాట్లాడ్డం తన ఉద్దేశ్యం కాదని సర్ది చెప్పడంతో సీరియస్‌నెస్ తగ్గింది.
Also Read
లైట్‌గా తీసుకోవాల్సిన విషయంపై ఇంత చర్చ ఎందుకన్న ఫీలింగ్ అటు జగ్గారెడ్డి కూడా ఉన్నట్టు తెలిసింది. మంత్రేదో…. క్యాజువల్‌గా అన్న విషయాన్ని పట్టుకుని అంత సాగదీయయడం ఎందుకు? సీరి.స్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారట ఆయన. అసలు పీసీసీ చీఫ్ పదవికి గడువు ఇంకా ముగియనే లేదు. అలాంటప్పుడు ఇలాంటి చర్చకి అవకాశం ఉండదంటూ జగ్గారెడ్డి తన సన్నిహితుల దగ్గర అన్నట్టు తెలిసింది. మొత్తానికి ఇష్యూ అలా వచ్చి ఇలా సెటిల్ అయిపోయినట్టు అయింది. అటు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కూడా జరిగిన ఎపిసోడ్‌ను లైట్‌గా తీసుకున్నారట. అసలు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే స్పందించిన తర్వాత ఇక ఇష్యూ ఏముందంటూ కొట్టి పడేశారు మహేష్‌గౌడ్. ఇదంతా చూస్తున్న వారు మాత్రం టీ కప్పులో తుఫాన్ అంటే ఇదేనంటూ చమత్కరిస్తున్నారు.
- Tags
- NTV Telugu
- OTR
- PCC
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!