Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parents Smoking: చాలా విషయాలలో వారి తల్లితండ్రుల అలవాట్లు పిల్లలపై ఎంతో ప్రాబవం చూపుతాయి. ఉదాహరణకు తల్లితండ్రులు ఉదయాన్నే లేచి రన్నింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటే వాటిని చూసి పిల్లలు కూడా చేయడానికి ఇష్టపడతారు. అదే పెద్దలు అలాగే పడుకొని ఉన్న, లేక ఉదయాన్నే లేచి ధూమపానం చేయడం వంటి పనులు చేస్తున్న ఆ ప్రభావం పిల్లలపై కూడా కాస్త నిదానంగా పడుతుంది.
Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు ఇది స్మోకింగ్ చేసే వ్యక్తికి, అతని చుట్టూ ఉన్నవారికి మాత్రమే ప్రమాదకరమని భావించేవారు. కానీ తాజాగా చేసిన ఓ అధ్యయనం తండ్రి స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో పుట్టే పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ వైద్య నిపుణులు చేసిన ఈ పరిశోధన ప్రకారం.. స్మోకింగ్ చేసే తండ్రుల పిల్లల్లో టైప్-2 డయాబెటిస్, లివర్ సమస్యలు, ఇంకా ఇతర మెటాబాలిక్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశముందని.. “జర్నల్ ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీ”లో ప్రచురించబడింది.
ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం.. స్మోకింగ్ వల్ల పురుషుల స్పెర్మ్ లో మార్పులు జరుగుతాయని ఉంది. ఈ మార్పులు భవిష్యత్తులో పుట్టే పిల్లల శరీరంలో షుగర్ మెటాబాలిజం, ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. దీంతో పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో సుమారు 1000 మంది స్మోకింగ్ చేసే పురుషులను పరిశీలించారు. వారి పిల్లల్లో సుమారు 30% మందికి డయాబెటిస్ లక్షణాలు, లివర్ సంబంధిత సమస్యలు కనిపించాయి. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం
స్మోకింగ్ సమయంలో శరీరంలోకి వెళ్లే నికోటిన్, మెటాబాలిజానికి సంబంధించిన ముఖ్య ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మార్చి టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ ప్రభావం తండ్రి నుంచి పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. అలాగే పిల్లల లివర్ ఫంక్షన్ పై కూడా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు. వైద్యుల సూచనల ప్రకారం.. తండ్రి కావాలని భావిస్తున్న పురుషులు ముందుగానే స్మోకింగ్ ను పూర్తిగా మానేయాలని.., ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. భవిష్యత్తులో పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!