PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు రాకను, కొత్త ఆరంభాల స్ఫూర్తిని జరుపుకుంటూ ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలుగు ప్రజల పండుగ ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి తెలుగు భాషలో ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని కోరుకున్నారు.
READ ALSO: JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ఈ సందర్భంగా ప్రధాని తన పోస్ట్‌లో ఈవిధంగా రాసుకొచ్చారు.. ‘పవిత్ర, శుభపద్రమైన ఉగాది పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వసంత రుతువు మన చుట్టూ ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచే అందమైన కాలమిది. కొత్తగా వికసించే పూల పరిమళం, ఈ కాలంలో లభించే పండ్ల ఆగమనం కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతంగా నిలుస్తాయి. కష్టజీవులైన మన రైతన్నలు గొప్ప ఆశావాదంతో తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇదే. జీవితంలోని అన్ని రుచులనూ స్వీకరించాలని గుర్తుచేసే సంప్రదాయ ఉత్సవం ఉగాది. అనేక సంస్కృతుల్లో వివిధ వంటకాలతో పాటు తీపి, చేదు రుచులు కలగలిసిన వంటకాలను తయారుచేసే సంప్రదాయం ఈ పండుగ రోజు ఉంది. ఇది జీవితానికి ఉండే లోతైన అర్థాన్ని తెలియజేయడంతో పాటు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా, విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు తలపెట్టే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించి, శాంతి, సానుకూలతను పంచాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి! pic.twitter.com/cSTLRBSu3R
— Narendra Modi (@narendramodi) March 19, 2026
READ ALSO: Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!