Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chana Dal Payasam: మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ అంటే మొదట గుర్తొచ్చేది ‘శెనగబేడల పాయసం’. పప్పులు, బియ్యం రవ్వ, కమ్మని బెల్లం కలయికతో చేసే ఈ పాయసం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్.. పండగ ఏదైనా, ఈ పాయసం ఉంటే ఆ విందు పూర్తి అయినట్లే. మరి ఆ పాతకాలపు రుచిని నేటి తరానికి నచ్చేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
శెనగబేడల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవే..
పచ్చి శెనగపప్పు – 1 చిన్న బౌల్
బియ్యం – పావు బౌల్
సగ్గుబియ్యం – పావు బౌల్
బెల్లం – 1.5 నుండి 2 బౌల్స్
నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి
పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు (ఆప్షనల్)
తయారీ విధానం..
శెనగపప్పు, బియ్యంను విడివిడిగా ఒక గంట పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యాన్ని 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా (కొంచెం బరకగా) గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 8 కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన శెనగపప్పు, సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. పప్పు ఉడికాక, గ్రైండ్ చేసిన బియ్యం రవ్వను కొద్దిగా నీళ్లలో కలిపి (ఉండలు కట్టకుండా) పాయసంలో వేసి ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్, ముఖ్యంగా ఎండు కొబ్బరి ముక్కలను వేయించి పాయసంలో కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
* పచ్చి శెనగపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మతుకు, శరీరానికి అవసరమైన బలాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది.
* ఈ పాయసంలో పంచదారకు బదులు మనం బెల్లాన్ని వాడుతున్నాం. బెల్లం ఒక అద్భుతమైన ఐరన్ (ఇనుము) వనరు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
* శెనగపప్పు, సగ్గుబియ్యం రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడానికి, కీళ్ల నొప్పులను నివారించడానికి సహాయపడతాయి.
* బియ్యం రవ్వ, సగ్గుబియ్యం తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులో మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేయడానికి ఇది ఒక మంచి ఆహారం.
* శెనగపప్పులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బియ్యం రవ్వలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణమే పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
* పచ్చి శెనగపప్పులో పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందిస్తాయి.
ఆరోగ్యంతో పాటు అమ్మమ్మల కాలం నాటి ఆ రుచిని ఆస్వాదించాలంటే, తప్పకుండా మీకు సమయం ఉన్నప్పుడు ఈ శెనగబేడల పాయసాన్ని ఒకసారి మీ ఇంట్లో ప్రయత్నించండి.. కచ్చితంగా ఇది మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
READ ALSO: Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్‌గా చేసుకోండి!
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..