Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్‌లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ టెక్నాలజీ, ఫేస్ స్వాప్, వాయిస్ క్లోనింగ్ ద్వారా తాను చెప్పని మాటలు చెప్పినట్లు చూపించే వీడియోలు తయారు చేస్తున్నారని తెలిపారు.
2025 చివరి నుండి ఈ నకిలీ కంటెంట్ భారీగా పెరిగిందని గంభీర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కొన్ని వీడియోలు లక్షల సంఖ్యలో వీక్షణలు సాధించడంతో ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా గంభీర్ పేరు, ఫోటోలను ఉపయోగించి అనుమతి లేకుండా పోస్టర్లు మరియు ఇతర ఉత్పత్తులు విక్రయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ సంస్థలు, అలాగే Meta Platforms, Google, YouTube, X వంటి టెక్ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు.
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
తన పిటిషన్‌లో గంభీర్ మొత్తం 16 మంది ప్రతివాదులపై కేసు వేస్తూ, తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలంటూ కోర్టును కోరారు. ఈ సందర్భంగా ఆయన రూ.2.5 కోట్ల నష్టపరిహారం కోరడమే కాకుండా, నకిలీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, భవిష్యత్తులో తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిషేధించాలని అభ్యర్థించారు. ఈ కేసులో గంభీర్ కాపీరైట్ చట్టం 1957, ట్రేడ్‌మార్క్ చట్టం 1999 మరియు వాణిజ్య న్యాయస్థానాల చట్టాన్ని ప్రస్తావించారు. అలాగే Amitabh Bachchan, Anil Kapoor కేసుల్లో వచ్చిన పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించిన తీర్పులను కూడా ఉదాహరణగా చూపించారు. నా గుర్తింపును ఒక ఆయుధంగా వాడుకున్నారు. నా పేరు, ముఖం, గొంతు దుర్వినియోగం చేయబడ్డాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, చట్టం మరియు గౌరవానికి సంబంధించిన విషయం అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. అయితే, ఈ కేసుపై Delhi High Court మార్చి 20న విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో వచ్చే తీర్పు భవిష్యత్తులో ఏఐ డీప్‌ఫేక్‌ల నియంత్రణ మరియు వ్యక్తిత్వ హక్కుల రక్షణకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!